ఘనంగా వాజ్‌పేయి జయంతి

ABN , First Publish Date - 2020-12-26T05:52:21+05:30 IST

నగరంలోని శనివారం అంగడివద్ద బీజేపీ సీనియర్‌ నాయకుడు జేడీ భగవాన్‌ ఆధ్వర్యంలో మాజీప్రధాని వాజ్‌పేయి జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు.

ఘనంగా వాజ్‌పేయి జయంతి
శనివారం అంగడి వద్ద కేక్‌ కట్‌చేస్తున్న పొల్సాని సుగుణాకర్‌రావు

కరీంనగర్‌ టౌన్‌, డిసెంబరు 25: నగరంలోని శనివారం అంగడివద్ద బీజేపీ సీనియర్‌ నాయకుడు జేడీ భగవాన్‌ ఆధ్వర్యంలో మాజీప్రధాని వాజ్‌పేయి జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా బీజేపీకిసాన్‌ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి పొల్సాని సుగుణాకర్‌రావు పాల్గొని వాజ్‌పేయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, కేక్‌ కట్‌ చేసి స్వీట్లు పంచారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యులు లింగంపల్లి శంకర్‌, రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధి పోతుగంటి సుజాతరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-26T05:52:21+05:30 IST