కాళేశ్వరానికి జాతీయ హోదా కల్పించు
ABN , First Publish Date - 2020-12-30T04:46:21+05:30 IST
కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌కు ప్రభు త్వ విప్, శాసన సభ్యులు బాల్క సుమన్ సవాల్ విసి రారు.
ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ సవాల్
కేసీఆర్‌పై విమర్శలు చేస్తే సహించేది లేదు
కరీంనగర్, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌కు ప్రభు త్వ విప్, శాసన సభ్యులు బాల్క సుమన్ సవాల్ విసి రారు. మంగళవారం రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి మీసేవా కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేస్తే సహించేది లేదని, దమ్ముంటే కేంద్ర ప్రభు త్వాన్ని ఒప్పించి కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలన్నారు. సీఎం కేసీఆర్‌పై చేస్తున్న విమర్శలను ఖం డించారు. భాష మార్చుకోవాలని, చిల్లరముల్లర రాజకీయాలు మానుకోవాలన్నారు. వ్యక్తిగత దూషణలు చేస్తే సహించేది లేదన్నారు. ముఖ్యమంత్రిని సైకో, పాస్‌పోర్ట్ బ్రోకర్ అంటారా.. ఇదేనా భారతీయ సంస్కృతి అన్నారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు, ఎన్నికల ముందు బీజేపీ మెనిఫెస్టోలో పెట్టిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. బీజేపీ ఎంపీగా తెలం గాణకు, కరీంనగర్ పార్లమెంటు స్థానంలో ఏం నిధులు తెచ్చారో ప్రజలకు వివరించాలన్నారు. 2001లో సింహగర్జనతో తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టినప్పుడు బండి సంజయ్ ఎక్కడ ఉన్నాడని ప్రశ్నించారు. కేసీఆర్ పోరాట ఫలితంగానే బీజేపీ శాఖ ఏర్పడిం దని, దాంతోనే సంజయ్‌కు బీజేపీ అధ్యక్ష పదవి వచ్చిందన్న విషయాన్ని గుర్తుం చుకోవాలన్నారు. సంజయ్ అసమర్థతో కరీం నగర్‌కు రావాల్సిన ట్రిబుల్ ఐటి రాయచూర్‌కు తరలిపోయిందన్నా రు. గతంలో కరీంనగర్ ఎంపీగా ఉన్న కేసీఆర్ కొత్తపల్లి- మనోహరాబాద్ రైల్వేలైన్ ప్రతిపాదన తెచ్చారన్నారు. ఎంపీగా వినోద్‌కుమార్ ఎన్నో జాతీయ రహదారులు తీసుకు వచ్చారన్నా రు. వరంగల్ ఎన్నికలు వస్తున్నాయని, వరంగల్, కరీంనగర్‌కు రావాల్సిన స్మార్ట్ సిటి నిధులు రాకుండా ఢిల్లీలో అడ్డుకునే ప్రయ త్నాలు చేస్తున్నారన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని బాండు పేపర్‌పై రాసిన వాగ్ధానం ఏమైందని నిజామాబాద్ ఎంపీ అర్వింద్‌ను ప్రశ్నించారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా కేసీఆర్ పనిచేస్తున్నారని, బీజేపీ సొంత ప్రయోజనాల కోసం పనిచేస్తుం దన్నారు. సమావేశంలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవి శంకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, జడ్పీ చైర్‌పర్సన్ కనుమల్ల విజయ, మేయర్ సునీల్‌రావు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, గ్రంథాలయ ఛైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి, డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపారాణిహరిశంకర్ పాల్గొన్నారు.