కొడుకు పట్టించుకోవడం లేదని పోలీసులకు ఫిర్యాదు

ABN , First Publish Date - 2020-12-26T19:22:18+05:30 IST

తమను కొడుకు, కోడలు పట్టించుకోవడం లేదని..

కొడుకు పట్టించుకోవడం లేదని పోలీసులకు ఫిర్యాదు

గన్నేరువరం(కరీంనగర్): తమను కొడుకు, కోడలు  పట్టించుకోవడం లేదని ఓ తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. మండల కేంద్రానికి చెందిన వృద్ధ దంపతులైన సంగెం పర్శరాములు అతని భార్య పోశవ్వలు కలిసి శుక్రవారం వారి కొడుకు, కోడలైన సంగెం రాజేందర్‌, సంతోషిలపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వృద్ధాప్యంలో ఉన్న తమ బాగోగులు చూసుకోవడం లేదని, ప్రతిరోజు వారిని వేధిస్తూ చిత్రహింసలకు గురి చేయడమే కాకుండా శుక్రవారం కొడుకు, కోడలు ఇంటి నుంచి వెళ్లగొట్టారని వృద్ధ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఫిర్యాదు చేసినట్లు ఎస్‌ఐ ఆవుల తిరుపతి తెలిపారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు రాజేందర్‌ సంతోషిల పైన కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2020-12-26T19:22:18+05:30 IST