చదువుతోపాటు వృత్తులపైనా దృష్టి సారించాలి

ABN , First Publish Date - 2020-12-21T04:21:52+05:30 IST

విద్యార్థులు చదువుతోపాటు ఆసక్తి ఉన్న వృత్తులపైనా దృష్టి సారించాలని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులం జిల్లా సమన్వయ అధికారి జాక్విలిన్‌ అన్నారు. సిరిసిల్ల అర్బన్‌ పరిధిలోని చిన్నబోనాల గురుకుల పాఠశాలలో ఆది వారం ‘యురేకా 2020, మన ఊరు, మన గురుకులం ’కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 76 గ్రామాలకు చెందిన 130 మంది విద్యార్థులకు 17 రకాల పోటీలను నిర్వహించారు.

చదువుతోపాటు వృత్తులపైనా దృష్టి సారించాలి
కార్యక్రమంలో మాట్లాడుతున్న జాక్విలిన్

సిరిసిల్ల రూరల్‌, డిసెంబరు 20: విద్యార్థులు చదువుతోపాటు  ఆసక్తి ఉన్న వృత్తులపైనా దృష్టి సారించాలని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులం జిల్లా సమన్వయ అధికారి జాక్విలిన్‌ అన్నారు. సిరిసిల్ల అర్బన్‌ పరిధిలోని చిన్నబోనాల గురుకుల పాఠశాలలో ఆది వారం ‘యురేకా 2020, మన ఊరు, మన గురుకులం ’కార్యక్రమంలో భాగంగా  జిల్లాలో 76 గ్రామాలకు చెందిన 130 మంది విద్యార్థులకు 17 రకాల పోటీలను నిర్వహించారు. ఇందులో ఎంపికైన 51 మంది వి ద్యార్థులకు నగదు బహుమతితోపాటు ప్రశంసపత్రాలు అంద జేశారు. అనంతరం  చిన్నబోనాల గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న రుచిత రాష్ట్ర స్థాయిలో  సూపర్‌ స్టూడెంట్‌ అవార్డుకు ఎంపిక కావడంతో ప్రిన్సిపాల్‌ జాక్విలిన్‌ అభినందించారు. 

ముస్తాబాద్‌: కష్టపడితేనే ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని ఆవునూర్‌ సర్పంచ్‌ బద్ది కళ్యాణిభాను పేర్కొన్నారు.  ఆవునూర్‌ జిల్లా పరిషత్‌ పాఠశాలలో ఆదివారం యురేక 2020 అనే కార్యక్రమంలో మాట్లాడారు. సమ్మయ్య, రమ్య చందు, మాధవి పాల్గొన్నారు.

 గంభీరావుపేట: మండలంలోని నర్మాల గురుకుల ఆశ్రమ పాఠశాల, దేశాయిపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఆదివారం యురేకా 2020 కార్యక్రమాన్ని నిర్వహించారు.  ఎంపీపీ కరుణసురేందర్‌రెడ్డి, ఎస్సై రవి, సర్పంచులు చంద్రకళ, రాజు, ప్రిన్సిపాల్‌ నిర్మల, పాఠశాల చైర్మన్‌ దోమకొండ సురేందర్‌ తదితరులు ఉన్నారు. 


ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలి

వేములవాడ: విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని వేములవాడ పట్టణ సీఐ వెంకటేశ్‌ అన్నారు. పట్టణంలోని బోయినపల్లి తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల ఒకేషనల్‌ కళాశాలలో ఆదివారం నిర్వహించిన యూరేకా-2020 కార్యక్రమంలో మాట్లాడారు. ప్రిన్సిపాల్‌ నరేంద్రకుమార్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ సంతోష్‌, చందుర్తి ప్రభుత్వ పాఠశాల హెచ్‌ఎం లక్ష్మినారాయణ పాల్గొన్నారు.  


స్థానిక బాలికల గురుకుల పాఠశాలలో..

స్థానిక బాలికల గురుకుల పాఠశాలలో నిర్వహించిన యూరేకా-2020 ఫెస్టివల్‌లో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రాంతీయ సమన్వయ అధికారి విద్యారాణి మాట్లాడుతూ పేదల కుటుంబాలకు చెందిన పిల్లలకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం గురుకుల పాఠశాలలు నిర్వహిస్తోందన్నారు. పిల్లల వైద్యుడు అనంత్‌రెడ్డి, ప్రిన్సిపాల్‌ నరసింహాచారి తదితరులు పాల్గొన్నారు. 


కష్టపడి చదివితేనే భవిష్యత్‌

కోనరావుపేట: విద్యార్థులు కష్టపడి చదివినప్పుడే మంచి భవిష్యత్‌ లభిస్తుందని క్విట్‌ ఇండియా ఫౌండేషన్‌ జిల్లా చీఫ్‌ అడ్వయిజర్‌, ఎస్సై రాజశేఖర్‌ అన్నారు. మండలంలోని సుద్దాలలో యురేకా-2020 పోటీ లను  నిర్వహించారు. సర్పంచ్‌ దేవలక్ష్మి శంకర్‌, ఉపసర్పంచ్‌ నాగ రాజు, ఎంపీటీసీ మమత, స్కూల్‌ చైర్మన్‌ విజయ్‌, ప్రేమ్‌, శేఖర్‌, వినోద్‌, అరుణ్‌,  చిన్నబోనాల ప్రిన్సిపాల్‌ వసంతకుమారి పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-21T04:21:52+05:30 IST