పల్లెప్రకృతి వనాలమీద దృష్టిపెట్టాలి

ABN , First Publish Date - 2020-09-06T07:17:02+05:30 IST

పల్లె ప్రకృతి వనాలమీద దృష్టి పెట్టాలని కలెక్టర్‌ కె శశాంక అన్నారు...

పల్లెప్రకృతి వనాలమీద దృష్టిపెట్టాలి

కలెక్టర్‌ కె శశాంక


కరీంనగర్‌, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): పల్లె ప్రకృతి వనాలమీద దృష్టి పెట్టాలని కలెక్టర్‌ కె శశాంక అన్నారు. శనివారం అన్ని మండలాల, గ్రామాల ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఆర్డీవోలు, ఎమ్మార్వోలతో కలిసి హరితహారం, పల్లె ప్రకృతి వనాలు, సెగ్రిగేషన్‌ షెడ్లు, డంపింగ్‌యార్డు, వైకుంఠదామాల పనులపై ఆయన వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అధికారులు పల్లె ప్రకృతి వనాల స్టేట్‌మెంట్‌ తప్పనిసరిగా ఇవ్వాలని అన్నారు. మండలాలు, గ్రామాల్లో ఖాళీ ఉన్న ప్రదేశాల్లో ప్లాంటేషన్‌ వేగంగా పూర్తి చేయాలని అన్నారు. గ్రామ పంచాయతీ వారిగా ప్లాంటేషన్‌ చెక్‌ చేసుకోవాలని అన్నారు. ప్రతిమండలం, గ్రామంలో హరితహారంలో ఇచ్చిన టార్గెట్‌ ప్రకారం ప్లాంటేషన్‌ పూర్తి చేయాలని అన్నారు. టార్గెట్‌ పూర్తి చేయని వారికి షోకాజ్‌ నోటీసు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.


భారత్‌ ఆత్మనిర్బర్‌ పథకం వేగవంతంగా పూర్తి చేయాలి

ప్రధానమంత్రి భారత్‌ ఆత్మ నిర్బర్‌ పథకాన్ని వేగవంతంగా పూర్తిచేయాలని కలెక్టర్‌ కె శశాంక అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో బ్యాంకర్లు, వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఆత్మ నిర్బర్‌ స్కీం కింద వీధి విక్రయదారులకు ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున అదించాలన్నారు. దరఖాస్తులు ఎక్కువగా వచ్చే విధంగా వీధి విక్రయదారులను ప్రోత్సహించాలని అన్నారు. దరఖాస్తులను ఎప్పటికప్పుడు పెండింగ్‌ లేకుండా చూడాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు రుణాలు మంజూర్యేలా చూడాలని అన్నారు. పీఎం స్వానిధి, ఆత్మనిర్బర్‌, జీఈసీఎల్‌, ఎంఎస్‌ఎంఈ, ప్రస్తుతం తీసుకున్న రుణాలపై 20శాతం పెంచి ఇవ్వాలని అన్నారు. ఈ స్కీంలు చిన్న, సన్నకారు రైతులకు కూడా ఉపయోగపడే విధంగా చూడాలని అన్నారు.


గన్నేరువరం; గుండ్లపల్లి రాజీవ్‌రహదారిపై నాటిన మొక్కలను కలెక్టర్‌ శశాంక శనివారం పరిశీలించారు. పంచాయతీరాజ్‌, పోలీస్‌, రెవెన్యూశాఖల సమన్వయంతో అవెన్యూ ప్లాంటేషన్‌ను చేయాలని కలెక్టర్‌ చూచించారు. మొక్కలు నాటేటప్పుడు రోడ్డుకు నిర్ణీత దూరం లో నాటాలన్నారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలన్నారు.

Updated Date - 2020-09-06T07:17:02+05:30 IST