శ్రీరాంసాగర్‌కు పోటెత్తిన వరద

ABN , First Publish Date - 2020-08-18T11:00:17+05:30 IST

ఆంధ్రజ్యోతి, జగిత్యాల : శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌కు వరదనీరు పోటెత్తుతోంది. ప్రాజెక్ట్‌ ఎగువ ప్రాంతంలో భారీగా వర్షాలు కురుస్తుండటంతో వరదనీరు వచ్చి చేరుతోంది.

శ్రీరాంసాగర్‌కు పోటెత్తిన వరద

 ప్రాజెక్ట్‌లోకి 64వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో 

 50 టీఎంసీలకు చేరిన నీటిమట్టం 


ఆంధ్రజ్యోతి, జగిత్యాల : శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌కు వరదనీరు పోటెత్తుతోంది. ప్రాజెక్ట్‌ ఎగువ ప్రాంతంలో భారీగా వర్షాలు కురుస్తుండటంతో వరదనీరు వచ్చి చేరుతోంది. సోమవారం ఒక్కరోజే దాదాపు ఐదు టీఎంసీల నీరు వచ్చింది. ప్రాజెక్టులోకి సోమవారం ఉదయం 47 క్యూసెక్యుల ఇన్‌ఫ్లో రాగా, మధ్యాహ్నం వరకు 70వేల క్యూసెక్కులకు పెరిగింది. సాయంత్రం 6 గంటలకు 64, 563 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో వస్తోంది.


మరో రెండు రోజుల పాటు ప్రాజెక్ట్‌లోకి భారీగా వరదనీరు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలుపుతున్నారు. ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 90.31 టీఎంసీలు కాగా సోమవారం సాయంత్రం వరకు 50.238 టీఎంసీలకు చేరుకుంది.  

Updated Date - 2020-08-18T11:00:17+05:30 IST