వరి పంటకు నిప్పు పెట్టిన రైతు

ABN , First Publish Date - 2020-11-27T04:47:43+05:30 IST

దోమ పోటుతో పంట ఎండిన రైతుకు కడుపు మండింది. సాగు చేసిన తన రెండు ఎకరాల వరి పంటకు నిప్పు అంటించి ప్రభుత్వం తీరుపై నిరసన వ్యక్తం చేశాడు ఓ రైతు.

వరి పంటకు నిప్పు పెట్టిన రైతు
వరి పంటకు నిప్పు పెడుతున్న రైతు

జగిత్యాల రూరల్‌, నవంబరు 26 : దోమ పోటుతో పంట ఎండిన రైతుకు కడుపు మండింది. సాగు చేసిన తన రెండు ఎకరాల వరి పంటకు నిప్పు అంటించి ప్రభుత్వం తీరుపై నిరసన వ్యక్తం చేశాడు ఓ రైతు. జగిత్యాల రూరల్‌ మండలంలోని చల్‌గల్‌ గ్రామానికి చెందిన పూదరి శంకర్‌ నియంత్రిత వ్యవసాయంలో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు తనకున్న రెండు ఎకరాల వ్యవసాయ భూమిలో సన్న రకం వరి పంట సాగు చేశాడు.  దోమపోటు సోకి రెండు ఎకరాల పంట పూర్తిగా ఎండిపోయింది. దీంతో ఆవేదన చెందిన రైతు శంకర్‌ గురువారం వరి పంటకు నిప్పటించాడు. పెట్టుబడి కూడా రాకపోగా, పూర్తిగా నష్టపోయానని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.


Updated Date - 2020-11-27T04:47:43+05:30 IST