చినుకు భయం

ABN , First Publish Date - 2020-11-26T05:37:41+05:30 IST

వానాకాలం పంటల సాగులో రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ఈసారి నైరుతి వర్షాలకుతోడు అల్ప పీడన వర్షాలు రైతులను తీవ్రంగా నష్టపరిచాయి. అక్టోబరు వరకు కురిసిన వర్షాలతో వరి, పత్తి పంటలు దెబ్బతిన్నాయి. మిగిలిన పంటనైనా కాపాడుకోవడానికి వరి కోతలు మొదలుపెట్టి కల్లాలు, రోడ్లపై ఆరబెటు ్టకుంటుండగా బంగాళాఖాతంలోని అల్పపీడనం తుఫానుగా మారే అవకాశం ఉన్నట్లు అధికారులు హెచ్చ రించడంతో ఆందోళనకు గురవుతున్నారు.

చినుకు భయం
రైస్‌మిల్లుల్లో ధాన్యం

- వాతావరణ కేంద్రం హెచ్చరికతో 

   రైతుల్లో ఆందోళన 

- కొనుగోళ్లలో జాప్యం.. కల్లాల్లోనే ధాన్యం 

- భారీ వర్షం వస్తే అపార నష్టం 

-  పెరుగుతున్న చలితో ఆరని ధాన్యం 

-  ఇప్పటికే వర్షాలతో రూ.3.28 కోట్ల పంట నష్టం

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

వానాకాలం పంటల సాగులో రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ఈసారి నైరుతి వర్షాలకుతోడు అల్ప పీడన వర్షాలు రైతులను తీవ్రంగా నష్టపరిచాయి. అక్టోబరు వరకు కురిసిన వర్షాలతో వరి, పత్తి పంటలు దెబ్బతిన్నాయి. మిగిలిన పంటనైనా కాపాడుకోవడానికి   వరి కోతలు మొదలుపెట్టి కల్లాలు, రోడ్లపై ఆరబెటు ్టకుంటుండగా బంగాళాఖాతంలోని అల్పపీడనం తుఫానుగా మారే అవకాశం ఉన్నట్లు  అధికారులు హెచ్చ రించడంతో ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు చలి పెరుగుతుండడం కలవరపెడుతోంది. తేమతో ప త్తి, వరి, పంటలకు నష్టం వాటిల్లే పరిస్థితి ఉంది. కొనుగోళ్లు  వేగంగా జరగకపోవడంపై రైతులు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. వానాకాలం సీజన్‌లో అధికవర్షాలకు 6,390 ఎకరాల్లో రూ.3 కోట్ల 28 లక్షల 51వేల విలువైన వరి, పత్తికి నష్టం వాటిల్లింది. వరికి ఎకరానికి రూ.5,671, పత్తి ఎకరానికి రూ.2,720 చొప్పు న పరిహారం అందిచాల్సి ఉంది. ఇప్పటివరకు ప్రభు త్వం ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. జిల్లాలోని 135  గ్రామాల్లో   5,671 ఎకరాల్లో వరి, 819 ఎకరాల్లో పత్తి పంటలకు నష్టం వాటిల్లింది. ఆగస్టులో పూతకు వస్తున్న సమయంలోనే అధిక వర్షాలు పడడంతో పత్తి, పూత నేల రాలింది. పత్తి ఎదిగే దశలో ఉండడతో రైతులు ఎంతో ఆశగా ఎరువు వేసుకున్నారు. ప్రస్తుతం పంట చేతికొచ్చిన దశలో చలితో తేమ శాతం పెరుగుతుండడం కొనుగోళ్లపై ప్రభావం చూపుతోంది.

 

61,990 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు 

జిల్లాలో వానాకాలం సాగులో 2.48 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు. ఇందులో వరి 1.39 లక్షల ఎకరాల్లో వేయగా ఈ సారి 3.10 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఇందులో 73,070 ఎకరాల్లో దొడ్డురకం, 66,621 ఎకరా ల్లో సన్నరకం పంట వేశారు. సన్నరకం సాగుకు ప్రభు త్వం బోనస్‌ అందిస్తుందని భావించిన  రైతులు గిట్టు బాటు ధర కూడా కల్పించకపోవడంతో తీవ్రంగా నష్ట పోతున్నారు. రైతులు ఆందోళనలు చేస్తున్నా ఫలితం మాత్రం కనిపించడం లేదు.  ప్రస్తుతం జిల్లాలో 226 కొనుగోలు కేంద్రాల ద్వారా 14,870 మంది రైతుల నుంచి 61,990 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇందులో ఐకేపీ ద్వారా 15,226 మెట్రిక్‌ టన్నులు, సింగిల్‌ విండోల ద్వారా 43,390 మెట్రిక్‌ టన్నులు, డీసీఎంస్‌ ద్వారా 1333 మెట్రిక్‌ టన్నులు, మెప్మా ద్వారా 358 మెట్రిక్‌ టన్నులు, ఏఎంసీ ద్వారా 1681 మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేశారు. ఇప్పటి వరకు రైతులకు రూ.129.21 కోట్లు చెల్లించాల్సి ఉండగా 30.84 కోట్లు ఖాతాల్లో జమ చేశారు. మరోవైపు కొనుగోళ్లలో జా ప్యం, వాయుగుండం హెచ్చరికలతో ఎలాంటి ఇబ్బం దులు పడాల్సి వస్తుందోనని రైతులు  భయాందోళనకు గురవుతున్నారు. 

Updated Date - 2020-11-26T05:37:41+05:30 IST