-
-
Home » Telangana » Karimnagar » farmer commits suicide
-
పరిహారం అందక రైతు ఆత్మహత్య
ABN , First Publish Date - 2020-12-06T05:45:40+05:30 IST
పరిహారం అందక సిరిసిల్ల పట్టణంలోని అంబేడ్కర్‌నగర్‌కు చెందిన సడిమెల కిషన్(45) అనే రైతు శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు.

- సీఎం, మంత్రి కేటీఆర్‌కు లేఖలు
సిరిసిల్ల క్రైం, డిసెంబరు 5: పరిహారం అందక సిరిసిల్ల పట్టణంలోని అంబేడ్కర్‌నగర్‌కు చెందిన సడిమెల కిషన్(45) అనే రైతు శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. నిరుపేద దళిత రైతు కిషన్‌కు రెండెకరాల వ్యవ సాయ భూమి ఉంది. సిరిసిల్ల శివారులోని మానేరు బ్యాక్ వాటర్‌కు అడ్డంగా కరకట్ట నిర్మించారు. ఈ కరకట్ట సమీ పంలో ఉన్న కిషన్ వ్యవసాయ భూమిలో ఊటతో 24 గుం టలు నీట మునిగింది. పరిహారం కోసం దరఖాస్తు చేసు కున్నా అందడంలేదు. ఉపాధి కోసం కరీంనగర్‌లో మేస్త్రీ పనిచేస్తున్న కిషన్‌కు లాక్‌డౌన్, ఇతర కారణాలతో పని దొరకలేదు. చేసిన అప్పులు భారమయ్యాయి. దీంతో మనస్తాపం చెందిన కిషన్ వ్యవసాయ భూమికి సమీపం లో దామెరకుంట వద్ద చెట్టుకు ఉరేసుకున్నాడు. ఆత్మహ త్యకు ముందు పరిహారం అందలేదని, ఇప్పటికైనా ఇప్పి ంచాలని సీఎం, మంత్రి కేటీఆర్‌కు రాసిన లేఖలో ఆవేదన వ్యక్తం చేశాడు. మృతుడికి భార్య ప్రమీల, కుమారుడు దినే ష్, కుమార్తె సంధ్య ఉన్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్ ఎస్సై రాజశేఖర్ తెలిపారు.