పరిహారం అందక..పనులు సాగక

ABN , First Publish Date - 2020-06-06T10:31:48+05:30 IST

వరద కాలువ నీటిని కాకతీయ కాలువకు మళ్లించి రైతులకు నీరందించాలన్న లక్ష్యంతో ఏడాది క్రితం చేపట్టిన

పరిహారం అందక..పనులు సాగక

కాకతీయ కాలువకు చేరని వదర కాలువ నీరు

టెండర్లు పూర్తయినా జాడ లేని భూసేకరణ

కాలువ నిర్మాణం చేపడితే 2.50 లక్షల ఎకరాలకు అందనున్న సాగునీరు

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌పై తగ్గనున్న 25 టీఎంసీల భారం


ఆంధ్రజ్యోతి, జగిత్యాల: వరద కాలువ నీటిని కాకతీయ కాలువకు మళ్లించి రైతులకు నీరందించాలన్న లక్ష్యంతో ఏడాది క్రితం చేపట్టిన సాగునీటి పథకం నిరుపయోగంగా మారింది. రూ.30 కోట్లతో కొత్త కా లువ నిర్మాణం చేపట్టి 2.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉండగా, రైతులకు పరిహారం చె ల్లించకపోవడంతో కాలువ నిర్మాణ పనులు ముందు కు సాగడం లేదు. కాలువ నిర్మాణం కోసం భూము లు ఇచ్చేందుకు రైతులు ముందుకు వచ్చినా ప్రభు త్వం పరిహారం చెల్లిచడంలో జాప్యంతో పనులు సా గడం లేదు. జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల పరిధిలోని రైతులకు ఉపయోగపడే కాలువ నిర్మాణ పనులు అ ధికారుల నిర్లక్ష్యం, నాయకుల అసమర్థత వల్ల సాగ డం లేదు. దీంతో భూములు కోల్పోతున్న రైతులు త మకు పరిహారం ఇవ్వాలంటూ ఆందోళనకు దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది.


పరిహారం అందక నిలిచిపోయిన పనులు

జగిత్యాల జిల్లాలోని పెగడపల్లి, ధర్మపురి మండలాలతో పాటు పెద్దపల్లి జిల్లాలోని రైతులకు సాగునీ రు అందించే డి-73 నుంచి డి-94 వరకు దాదాపు 2.50 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌లో యేటా నీటిమట్టం తగ్గుతుండటంతో రైతులకు రెండు పంటలకు సాగునీరు అందించాలనే ఆ లోచనతో ఇటీవల ప్రభుత్వం శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌కు పునరుజ్జీవ పథకాన్ని చేపట్టింది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ నుంచి నీటిని ఎత్తిపోతల ద్వారా ఎస్సారెస్పీ వరద కాలువలోకి ప్యాకేజీ-8 గాయత్రి పంపుహౌజ్‌ ద్వారా తరలించాలని నిర్ణయించింది. ఇప్పటికే జగిత్యాల జి ల్లాలోని మల్యాల మండలం రాంపూర్‌, ఇబ్రహీంపట్నం మండలం రాజేశ్వర్‌రావుపేటలో పంపుహౌజ్‌ నిర్మాణం చేపట్టగా నీటిని వరద కాలువలోకి మళ్లిస్తున్నారు.


వరద కాలువలోకి వస్తున్న నీటిని కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం ర్యాలపల్లి వద్ద ఉన్న వరద కాలువ నుంచి జగిత్యాల జిల్లా మల్యాల మం డలం తాటిపెల్లి వరకు ఉన్న కాకతీయ కాలువకు  మళ్లించాలని నిర్ణయించారు. దాదాపు 3 కి.మీ. మే ర కు పనులు సాగగా, మిగిలిన 56 ఎకరాలకు పరిహా రం అందకపోవడంతో పనులు నిలలిచిపోయాయి. దీని ద్వారా పెగడపల్లి, ధర్మపురి మండలాలతో పా టు పెద్దపల్లి జిల్లాలోని డి-73 నుంచి డి-94 వర కు ఉన్న డిస్ర్టిబ్యూటరీల ద్వారా రైతులకు నీరు చేరుకోనుంది. ర్యాలపెల్లి నుంచి తాటిపెల్లి వరకు దాదాపు 8 కి.మీ. పొడవు కాలువ తవ్వి, ర్యాలపల్లిలో ఉన్న కాకతీయ కాలువకు నీటిని మళ్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రభుత్వం 2018-19లో రూ.30 కోట్లు మంజూరు చేసింది. ఇందులో రూ.22 కోట్లతో సివిల్‌ వర్క్‌ చేయాల్సి ఉంటుంది.


రూ.8 కోట్లతో భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం చెల్లించాలని నిర్ణయించారు. దాదాపు 56 ఎకరాల భూములను రైతు లు కోల్పోతుండగా, 2019, అక్టోబరు నెలలోనే జగి త్యాల ఆర్డీవో భూములు సేకరించి ప్రభుత్వానికి నివే దికలు పంపారు. రైతులు కూడా తాము భూములు ఇచ్చేందుకు అంగీకరించారు. కానీ ప్రభుత్వం నుంచి రూ.8 కోట్లు మంజూరు కాకపోవడంతో దాదాపు 9 మాసాలుగా రైతులకు పరిహారం ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. సివిల్‌ వర్క్‌ కోసం టెండర్‌ ప్రక్రియ నిర్వ హించగా పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్‌ కొంత మేరకు పనులు చేపట్టారు. రైతులకు పరిహారం ఇ వ్వకపోవడంతో తాటిపెల్లి నుంచి ర్యాలపల్లి వరకు కాలువ నిర్మాణ పనులు సాగడం లేదు. 


శ్రీరాంసాగర్‌పై తగ్గనున్న భారం

గంగాధర మండలం ర్యాలపల్లిలో ఉన్న వరద కా లువకు మల్యాల మండలం తాటిపెల్లి సమీపంలో ఉన్న కాకతీయ కాలువ నుంచి నీటిని మళ్లిస్తే శ్రీరాం సాగర్‌ ప్రాజెక్ట్‌పై భారం తగ్గే అవకాశం ఉంది. గోదావరి పంపుహౌజ్‌ నుంచి నీటిని వరద కాలువలోకి మళ్లించి, అక్కడి నుంచి కాకతీయ కాలువకు మళ్లిస్తే 25 టీఎంసీల నీరు నేరుగా జగిత్యాల జిల్లాలోని పెగడపల్లి, ధర్మపురి, పెద్దపల్లి జిల్లాల రైతులకు చేరనుం ది.


దీంతో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌పై దాదాపు 25 టీఎం సీల నీటి భారం తగ్గే అవకాశం ఉంది. ఇప్పటికైనా నాయకులు, అధికారులు చొరవ చూపి రూ.8 కోట్లు మంజూరయ్యేలా చూస్తే కాలువ నిర్మాణ పనులు పూర్తి కానుండగా, రైతులకు లబ్ధి చేకూరనుంది. ఇదిలా ఉంటే గురువారం ఎమ్మెల్సీ జీ వన్‌రెడ్డి ఆధ్వర్యంలో రైతులు పరిహారం చెల్లించా లంటూ ఆందోళన చేశారు. దీంతో ప్రభుత్వం స్పం దించి రూ 4 కోట్లు విడుదల చేసినట్లు సమాచారం. పూర్తి స్థాయిలో పరిహారం వస్తే పనులు సాగను న్నాయి.

Updated Date - 2020-06-06T10:31:48+05:30 IST