ఆరోగ్య పరిరక్షణకు వ్యాయామం తప్పనిసరి

ABN , First Publish Date - 2020-03-02T11:26:07+05:30 IST

విద్యార్థుల్లో, ప్రజల్లో ఆరోగ్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు రన్నింగ్‌, వ్యాయామం తప్పనిసరి అని ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్‌రావు అన్నారు.

ఆరోగ్య పరిరక్షణకు వ్యాయామం తప్పనిసరి

 ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్‌రావు

 ఘనంగా రన్‌ ఫర్‌ ఇండియా 


కరీంనగర్‌ స్పోర్ట్స్‌, మార్చి 1: విద్యార్థుల్లో, ప్రజల్లో ఆరోగ్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు రన్నింగ్‌, వ్యాయామం తప్పనిసరి అని ట్రస్మా రాష్ట్ర  అధ్యక్షుడు యాదగిరి శేఖర్‌రావు అన్నారు. ట్రస్మా జిల్లా శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్‌ ఎల్‌ఎండీ కట్టపై రన్‌ ఫర్‌ ఇండియా పేరుతో విద్యార్థులు క్రీడాకారులకు 2కే, 5కే రన్‌ను ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జెండా ఊపి ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ వ్యాయామం, వాకింగ్‌, రన్నింగ్‌లను నిత్యజీవితంలో ఒక భాగంగా చేసుకుని ఆరోగ్యవంతమైన జీవనం గడపాలన్నారు. విద్యార్థుల్లో శారీరక, మానసిక ఎదుగుదలకు క్రీడలు, వ్యాయామం దోహద పడుతాయని ఆయన పేర్కొన్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు ఆరోగ్య సృహను పెంపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఎరోబిక్స్‌ అందరినీ ఆకట్టుకుంది.


అనంతరం అపోలో ఆస్పత్రి వైద్యులు విద్యార్థులకు, ప్రజలకు పలు ముఖ్యమైన సూచనలుచేశారు. డ్యాం కట్ట మొదట్లో ప్రారంభమైన ఈ రన్‌ బైపాస్‌రోడ్డు వద్ద ముగిసింది. కార్యక్రమంలో వివిఽధ పాఠశాలల విద్యార్థులు, కరస్పాండెంట్లు పాల్గొన్నారు. కార్యక్రమంలో ట్రస్మా జిల్లా కార్యదర్శి దాసరి శ్రీపాల్‌రెడ్డి, నగర కార్యదర్శి నరేశ్‌, కోశాధికారి శ్రీనివాస్‌గౌడ్‌, నగర అధ్యక్షుడు శ్రీనివాసరావు, రాష్ట్ర సభ్యుడు ముస్తాక్‌ ఆలీఖాన్‌, శ్రీకాంత్‌, సుజిత్‌, మహేశ్‌, చిన్నప్ప, చరణ్‌, వివిధ పాఠశాలల కరస్పాండెంట్లు డాక్టర్‌ ఈ ప్రసాదరావు, ఎస్‌ కొంరయ్య, రమణారావు, దాసరి శ్రీనివాస్‌రెడ్డి, ఎండీ సలీం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-03-02T11:26:07+05:30 IST