-
-
Home » Telangana » Karimnagar » Evidence of police determination
-
పోలీసుల దృఢసంకల్పానికి నిదర్శనం
ABN , First Publish Date - 2020-11-28T05:16:25+05:30 IST
కరీంనగర్ పో లీస్ కమిషనరేట్ పోలీసుల ధృఢసంకల్పానికి నిద ర్శనం మియావాకి పద్ధతిలో మొక్కలు నాటిన యాదాద్రి మోడల్‌ఫారెస్ట్ అని రాష్ట్ర అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ సెక్రెటరీ లోకేష్ జైస్వాల్ అన్నారు.

యాదాద్రి మోడల్ ఫారెస్ట్ రాష్ట్ర అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ సెక్రెటరీ లోకేష్ జైస్వాల్
కరీంనగర్ క్రైం, నవంబరు 27: కరీంనగర్ పో లీస్ కమిషనరేట్ పోలీసుల ధృఢసంకల్పానికి నిద ర్శనం మియావాకి పద్ధతిలో మొక్కలు నాటిన యాదాద్రి మోడల్‌ఫారెస్ట్ అని రాష్ట్ర అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ సెక్రెటరీ లోకేష్ జైస్వాల్ అన్నారు. కరీంనగర్ సిటీ పోలీస్ శిక్షణ కేంద్రంలో మియా వాకి ప్రాజెక్టు-1,2లను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరీంనగర్ పోలీసులు చేపట్టిన విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చే సేందుకు రాష్ట్రంలోని 9 జిల్లాలకు చెందిన అటవీ శాఖ అధికారులు శనివారం అధ్యయ నానికి రాను న్నారని తెలిపారు. పోలీస్ కమిషనర్ వీబీ కమలాసన్‌రెడ్డి మియావాకి పద్ధతి లో యాదాద్రిమోడల్ ప్రాజెక్టు-1 లో భాగంగా ఒకఎకరం విస్తీర్ణంలో 17, 500మొక్కలు, రెండో విడతలో 1.14 ఎ కరాలలో 14,800 మొక్కలతో పాటు హరితహారంలో 2017 సంవత్సరంలో నాటిన మొక్కల సంరక్షణకు తీసుకు న్న చర్యలు ధృఢసంకల్పంతో చేపట్టి న వారి మహత్కార్యానికిని దర్శనమ ని చెప్పడంలో ఎలాంటి సందేహం లే దన్నారు. నాటిన ప్రతి మొక్కను సం రక్షించేందుకు చేపట్టిన చర్యలు వా రి అంకిత భావాన్ని తెలియజే స్తున్నా యన్నారు. కమిషనరేట్ పోలీసులు చేపట్టిన ఈ గొప్పపనితో రాబోవు మూడు నాలుగేళ్లలో కరీంనగర్ అడ వులకు నిలయంగా మారబోతుందని అన్నారు. ఈ ఘనకీర్తి పోలీసుల అంకిత భావంతో సాధ్యమైందన్నారు. ఈ మొక్కల కు డ్రిప్‌ఇరిగేషన్ ద్వారా నీరు, మొక్కల ఎదుగుదలకు ఎరు వులు అందిస్తున్న తీరును చూసి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. తాను రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పర్యటించానని, ఇక్క డి పోలీసులు మొక్కల పెంపకం వాటి సంరక్షణ కోసం తీసు కుంటున్న చర్యలు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. మి యావాకి ప్రాజెక్టుల్లో, హరితహారంలో నాటిన మొక్కలు, సం రక్షణ చర్యలు, డ్రిప్ విధానాలకు సంబంధించిన ఫొటో ఎగ్జి బిషన్‌ను వారు తిలకించారు. అనంతరం యాదాద్రి మోడల్- 2 ప్రాజెక్టు ప్రాంతంలో ప్రిన్సిపల్ చీఫ్ సెక్రెటరీతో పాటు వ రంగల్ సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ ఎంజే అక్బర్, జగిత్యాల డీఎఫ్ వో బీ వెంకటేశ్వరరావు, కరీంనగర్ డీఎఫ్‌వో ఎం రవిప్రసాద్ మొక్కలు నాటారు. కార్యక్రమంలో సిటీ పోలీస్ శిక్షణ కేంద్రం (పీటీసీ) ప్రిన్సిపాల్, అడిషనల్ డీసీపీ ఎస్ శ్రీనివాస్, ఇన్ చార్జి ఫారెస్ట్ రేంజర్ చైతన్యఆనంద్, ఆర్‌ఐలు కిరణ్, జాని మియా మల్లేశం, సీఐ నాగేశ్వర్‌రావు, పోలీసులు పాల్గొన్నారు.