సమస్తం బంద్‌..

ABN , First Publish Date - 2020-03-23T10:04:03+05:30 IST

రాష్ట్రంలో కరోనా వైరస్‌ బారినపడి వారి సంఖ్య 26 చేరుకోవడంతో దాని ఉదృతిని తగ్గించేందుకు సీఎం కేసీఆర్‌ ఈనెల 31 వర కు ...

సమస్తం బంద్‌..

  • - ఈనెల 31 వరకు రాష్ట్రం లాక్‌డౌన్‌ 
  • - ఆర్టీసీ బస్సులు, ఆటోలు,  టాక్సీలు బంద్‌ 
  • - రేషన్‌ కార్డులపై ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం 
  • - నిత్యావసరాలకు పేదలకు రూ.1500 
  • - జిల్లాలో 2,16,984 రేషన్‌కార్డులు 


(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి) : రాష్ట్రంలో కరోనా వైరస్‌ బారినపడి వారి సంఖ్య 26 చేరుకోవడంతో దాని ఉదృతిని తగ్గించేందుకు సీఎం కేసీఆర్‌ ఈనెల 31 వర కు ప్రకటిస్తూ సంచనల నిర్ణయం తీసుకు న్నారు. ఆదివారం చేపట్టిన జనతా కర్ఫ్యూ విజయవంతం కావడంతో పాటు ప్రజలంతా కరోనా వ్యాప్తి నివారణకు ఐక్యత చేరడంతో సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. జనతా కర్ఫ్యూలాగానే ఈనెల 31వ తేది వరకు రోడ్డె క్కనివ్వమని ప్రకటించారు. ఇతర రాష్ర్టాల నుంచి వచ్చే వాహనాలు రాకుండా ఉండేందు కు అన్ని సరిహద్దులను మూసి వేస్తున్నారు. రైళ్ల రాకపోకలు కూడా రద్దు చేశారు. ఈ క్ర మంలో ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా ఉండేందుకు రేషన్‌కార్డులపై ఒక్కో వ్యక్తికి 12 కిలోల బియ్యాన్ని ఉచితంగా ఇస్తామని సీఎం ప్రకటించారు. అలాగే కార్డులు కలిగిన కుటుం బానికి నిత్యావసర సరుకుల కొనుగోళ్ల కోసం పదిహేను వందల రూపాయల చొప్పున అం దజేస్తామని చెప్పారు. 


జిల్లాలో 2,16,924 కార్డులు

జిల్లాలో ఆరోగ్య భద్రత అంత్యోదయ అన్న పూర్ణ కార్డులు కలిపి మొత్తం 216924 కార్డు లు ఉన్నాయి. ఈ కార్డులు కలిగిన వారికి 1500 రూపాయల చొప్పున అందజేయనున్నా రు. దీనికి ప్రభుత్వం విధివిధానాలను ఖరారు చేస్తుంది. అత్యవసర విభాగాలైన వైద్య, ఆరో గ్య, విద్యుత్‌, పోలీస్‌ శాఖల అధికారులు మొ త్తం మంది విధుల్లోనే ఉంటారు. వివిధ శాఖ లకు చెందిన ఉద్యోగులు రొటేషన్‌ పద్ధతిలో 20శాతం చొప్పున నిధులు నిర్వహించనున్నా రు. కిరాణ షాపులు, కూరగాయల షాప్‌లో మినహా అన్నింటిని బంద్‌చేయనున్నారు. వైన్‌ షాపులు కూడా అన్నింటిని బంద్‌ చేశారు. ఆర్టీసీ బస్సులు, ఆటోలు, టాక్సీలు 31వ తేది శాఖలకు చెందిన ఉద్యోగులు రొటేషన్‌ పద్ధతి లో 20 శాతం చొప్పున నిధులు నిర్వహించను న్నారు. కిరాణషాపులు, కూరగాయల షాప్‌లో మినహా అన్నింటిని బంద్‌చేయనున్నారు. వైన్‌ షాపులు కూడా మూసి వేయనున్నారు. ప్రైవే టు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు ఈ వారం రోజుల పాటు వేతనాలు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. పరిశ్రమలను కూడా వారంరో జుల పాటు మూసి వేయనున్నారు. అందులో పని చేసే కార్మికులు సైతం ఆ సంస్థలు వేత నాలు ఇవ్వాల్సిందేనని తెలిపింది.


రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా పాజిటివ్‌ కేసులు సంఖ్య 26 చేరుకున్నది. ఆదివారం ఒక్క రోజే ఐదు గురికి పాజిటివ్‌ వచ్చింది. ఇందులో ఒకరు డిశ్చార్జి కాగా 25 మందికి వైద్యం అందిస్తు న్నారు. 25 మంది విదేశాల నుంచి వచ్చిన వారు కాగా, వారి నుంచి ఒకరికి వైరస్‌ సంక్ర మించింది. ఇది మరికొంతమందికి వ్యాప్తిచెం దే అవకాశాలు ఉండటంతో ప్రభుత్వం ఈ నెల 31వ తేది వరకు చేయాలని నిర్ణయించిం ది. తమ ఆరోగ్య పరిరక్షణ కోసం తమ ఆరో గ్యాన్ని కాపాడుకునేందుకు స్వీయరక్షణ పా టించాలని ఎవరు కూడా ఇళ్ల నుంచి బయట కు రావద్దని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు. 


Updated Date - 2020-03-23T10:04:03+05:30 IST