ప్రతీ ఒక్కరు భక్తి భావం కలిగి ఉండాలి

ABN , First Publish Date - 2020-12-29T04:43:24+05:30 IST

ప్రతీ ఒక్కరు భక్తిభా వం కలిగి ఉండాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు.

ప్రతీ ఒక్కరు భక్తి భావం కలిగి ఉండాలి
మంత్రికి జ్ఞాపికను అందజేస్తున్న ఆలయ నిర్వాహకులు

 రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌

ధర్మారం, డిసెంబరు 28: ప్రతీ ఒక్కరు భక్తిభా వం కలిగి ఉండాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. సోమవారం ధర్మారంలో అయ్యప్ప స్వాములకు, భక్తులకు మంత్రి అన్నదాన (బిక్ష) కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అయ్యప్ప ఆలయంలో నిర్మించిన గోపూజ మందిరం, గోశాల, వంటశాలను మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్‌ మాట్లాడుతు.. రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి ప్ర భుత్వం కృషి చేస్తోందన్నారు. ధర్మారం అయ్యప్ప ఆలయం భక్తులకు ఎంతో ఆహ్లాదకరంగా ఉందని ఆలయ నిర్వహాకులను మంత్రి అభినందించారు. ఆలయంలో గట్టు నరహారి శర్మావధాని ఆధ్వర్యం లో మంత్రికి ఘన స్వాగతం పలికారు. ఆలయంలో నిర్వహించిన గణపతి హోమం కార్యక్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పాల్గొన్నారు. అనంతరం ఆలయ వ్యవస్థాపకులు తాటిపల్లి సునీత-ఈఽశ్వర్‌ మంత్రిని సన్మానించి జ్ఞాపికను అందజే శారు. 

ఘనంగా గణపతి, నవగ్రహాల ప్రతిష్ఠాపన 


ధర్మారం అయ్యప్ప ఆలయంలో సోమవారం గణపతి, నవగ్రహాల ప్రతిష్ఠాపన ఘనంగా నిర్వహించారు. గణపతి, నవగ్రహ హోమములు చేశారు.  మొదటగా ఆలయం ఎదుట గణపతి విగ్రహాన్ని ఆదిలాబాద్‌ శ్రీరా మచంద్ర గోపాలకృష్ణ మఠం 10వ మఠాధిపతి శ్రీయోగానంద సరస్వతి స్వామీజీ ప్రతిష్ఠించారు. అనంతరం ఆలయ ఆవర ణలో కుజుడు, శని, సూర్యుడు, బుధుడు, చంద్రు డు, రాహు, కేతు, శుక్రుడు, గురుడు నవగ్రహాలను మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి స్వామీజీ ప్రతిష్ఠించారు. గట్టు నరహరి శర్మా వధాని, ఆలయ వ్యవస్థాపకులు తాటిపల్లి సునీత-ఈఽశ్వర్‌, వేద పండితులు, అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-29T04:43:24+05:30 IST