సాగు నీరందేలా ప్రతి కాలువను శుభ్రపరచాలి
ABN , First Publish Date - 2020-06-18T10:36:58+05:30 IST
ఈ యేడాది అన్ని గ్రామాల్లోని పంట పొలాలకు సా గు నీరందించేందుకు అనుసంధానంగా ఉన్న కాలువలను ఉపాధి హామి పథకం ద్వారా
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేష్
జగిత్యాల, ఆంధ్రజ్యోతి: ఈ యేడాది అన్ని గ్రామాల్లోని పంట పొలాలకు సా గు నీరందించేందుకు అనుసంధానంగా ఉన్న కాలువలను ఉపాధి హామి పథకం ద్వారా కూలీలతో ప్రతి కాలువను శుభ్రపరచాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్య దర్శి శ్రీ సోమేష్ అన్నారు. బుధవారం ఆయన హైదరాబాద్ నంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామాల్లోని పంట పొలాలకు సాగు నీరం దించేందు కు అనుసంధానంగా ఉన్న కాలువలను శుభ్రపర్చాలని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివరించారు. 6విడత హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా ప్రణా ళికలు రూపొందించాలన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రవి, అదనపు కలెక్టర్ రాజేశం, డీఆర్డీఏ పీడీ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.