పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలి

ABN , First Publish Date - 2020-02-16T09:56:56+05:30 IST

పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలి

పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలి

  • జిల్లా పరిషత్‌ అధ్యక్షురాలు వసంత

జగిత్యాల టౌన్‌, ఫిబ్రవరి 15: పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై హరిత జిల్లాగా మార్చాలని జిల్లా పరిషత్‌ అధ్యక్షురాలు దావ వసంత అన్నారు. శనివారం జడ్పీ కార్యాలయంలో ఎంపీడీవోలతో సమీక్ష నిర్వహించారు. అనంతరం జడ్పీ చైర్‌ పర్సన్‌ మాట్లాడుతూ ఈ నెల 17న ముఖ్యమంత్రి కేసీఆర్‌ జన్మదినం  పురస్కరించుకుని ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఈవో శ్రీనివాస్‌, డిప్యూటీ సీఈవో శ్రీలతరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-02-16T09:56:56+05:30 IST