తెలంగాణ సాయుధ పోరాట యోధుడు ఎల్లారెడ్డి

ABN , First Publish Date - 2020-12-28T05:25:44+05:30 IST

తెలంగాణ సాయుధ పోరాట యోదుడు బద్దం ఎల్లారెడ్డి అని సీపీఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు అన్నారు. మండలంలోని గాలిపెల్లి గ్రామంలో ఆదివారం బద్దం ఎల్లారెడ్డి 42వ వర్ధంతి నిర్వహించారు.

తెలంగాణ సాయుధ పోరాట యోధుడు ఎల్లారెడ్డి
బద్దం ఎల్లారెడ్డి విగ్రహానికి పూలమాలలు వేస్తున్న నాయకులు

ఇల్లంతకుంట, డిసెంబరు 27: తెలంగాణ సాయుధ పోరాట యోదుడు బద్దం ఎల్లారెడ్డి అని సీపీఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు  అన్నారు. మండలంలోని గాలిపెల్లి గ్రామంలో ఆదివారం బద్దం ఎల్లారెడ్డి 42వ వర్ధంతి నిర్వహించారు. సీపీఐ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించిన ఎల్లారెడ్డి రజాకార్లకు వ్యతిరేకంగా ఉద్యమించిన మహనీయుడన్నారు. ఎంపీ, ఎమ్మెల్యేగా పలుసార్లు పని చేశారని, పీడిత ప్రజల పక్షాణ నిలిచారని అన్నారు.  సర్పంచ్‌ వాణీదేవరెడ్డి, సీపీఐ కార్యదర్శి భూంపెల్లి భూంరెడ్డి, మాజీ సర్పంచ్‌ లింగారెడ్డి, వ్యవసాయకార్మిక సంఘం అధ్యక్షుడు సావనపెల్లి మల్లేశం, నాయకులు జుట్టు లక్ష్మణ్‌, కిష్టయ్య, నంది శ్రీను, గుంటి మొండయ్య, జానీ, కదురు మొండయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-28T05:25:44+05:30 IST