విశ్వకర్మ సమస్యల పురిష్కారానికి కృషి

ABN , First Publish Date - 2020-12-31T05:09:20+05:30 IST

విశ్వకర్మల సమస్యలపై ప్రభుత్వం దృష్టికి తీసుకవెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని అసెంబ్లీ మాజీ స్వీకర్‌ మధుసూదనాచారి అన్నారు

విశ్వకర్మ సమస్యల పురిష్కారానికి కృషి
నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరిస్తున్న మాజీ స్వీకర్‌ మధుసూదనాచారి

 మాజీ స్వీకర్‌ మధుసూదనాచారి

కోరుట్ల, డిసెంబరు 30: విశ్వకర్మల సమస్యలపై ప్రభుత్వం దృష్టికి తీసుకవెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని అసెంబ్లీ మాజీ స్వీకర్‌ మధుసూదనాచారి అన్నారు. బుధవారం పట్టణంలోని పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయ ప్రాగణంలో నిర్వహించిన విశ్వకర్మ జాగృతి సభకు ఎమ్మెల్యే విద్యాసాగర్‌ రావుతో కలిసి మాజీ స్పీకర్‌ మధుసూదనాచారి పాల్గొన్నారు. ప్రభుత్వం విశ్వకర్మల అభివృద్ధికి దృష్టి సారించి ప్రత్యేక పథకాలను అందిస్తుందన్నారు. అనంతంర విశ్వక ర్మ అసోషియేషన్‌ నూతన సంవత్సర క్యాలేండర్‌ను సంఘ సభులతో కలిసి ఆవిష్కరించారు. 


Read more