అన్ని కార్యాలయాల్లో ఈ-ఆఫీస్‌ అందుబాటులోకి తీసుకురావాలి

ABN , First Publish Date - 2020-10-17T06:44:52+05:30 IST

జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల నుండి బుధవారం నాటికి ఈ-ఆఫీసుకు అనుసంధానం చేసి

అన్ని కార్యాలయాల్లో ఈ-ఆఫీస్‌ అందుబాటులోకి తీసుకురావాలి

కలెక్టర్‌ కె శశాంక


కరీంనగర్‌, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల నుండి బుధవారం నాటికి ఈ-ఆఫీసుకు అనుసంధానం చేసి పేపర్‌ రహితంగా సర్క్యూలేట్‌ చేయాలని కలెక్టర్‌ కె శశాంక అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఈ-ఆఫీస్‌ అనుసంధానం, ఫైళ్ల నిర్వహణపై జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో ఇప్పటికే ఈ-ఆఫీసు ద్వారా ఫైళ్ల నిర్వహణ చేపట్టామని, అలాగే అన్ని కార్యాలయాలు ఈ-ఆఫీసుకు అనుసంధానమై ఉత్తర ప్రత్యుత్తరాల నిర్వహణ చేపట్టాలని ఇదివరకే ఆదేశిం చడం జరిగిందన్నారు. అతికొద్ది కార్యాలయాలు మాత్రమే ఈ-ఆఫీసుకు అనుసంధానమయ్యారని తెలిపారు. మిగిలినవారు వచ్చే బుధవారం నాటికి అనుసంధానమై ఫైళ్ల నిర్వహణ చేపట్టాలని, అలాగే మండలస్థాయి కార్యాల యాలన్నీ ఈ నెల 24వతేదీ వరకు ఈ-ఆఫీసుకు అనుసంధానం కావాలని, లేనిపక్షంలో 25 నుండి ఫిజికల్‌గా వచ్చే ఫైల్స్‌ ఎట్టి పరిస్థితుల్లో చూడబడవని అన్నారు. అలాగే ఈ-ఆఫీసు ద్వారా కలెక్టర్‌కు పంపే ఫైళ్లు మాత్రమే కాదని మీ యొక్క కార్యాలయాలకు పంపే ఫైళ్లు కూడా ఈ-ఆఫీసు ద్వారానే పంపాలని అన్నారు. అంతేగాక కార్యాలయానికి వచ్చే అన్ని లేఖలు కూడా అనుసంధాన మైన తదుపరి కార్యాలయంలోని అన్ని పాత ఫైళ్లు వెలికితీసి వాటిలో నోట్‌ ఫైలు ఎన్ని పేజీలు ఉన్నది, కరెంట్‌ ఫైలు ఎన్ని  పేజీలు ఉన్నది లెక్క పెట్టి వాటన్నింటిని ఈ-ఆఫీసుకు అనుసంధానం చేయాలని ఆయన సూచించారు. 


జిల్లా కలెక్టర్‌ కార్యాలయ ప్రాంగణంలో దాదాపు 58 శాఖలు నిర్వహించుట జరుగుతుందని, ప్రాంగణంలో పరిశుభ్రత, సానిటేషన్‌, మంచినీటి సౌకర్యం, విద్యుత్‌ అవసరాలకు, ఇతరత్ర సౌకర్యాలు కల్పించుటకు జిల్లా అధికారులంద రూ తమవంతు సహకారం అందించాలని జిల్లా కలెక్టర్‌ కె శశాంక అధికారుల ను కోరారు. కార్యాలయాలను ప్రతిరోజు  శుభ్రంగా ఉంచుకోవాలని, అలాగే కావలసిన సౌకర్యాలపై నివేదిక పంపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు శ్యాంప్రసాద్‌లాల్‌,  నరసింహారెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి వెంకట మాధవరావు, ఆర్డీవో ఆనంద్‌ కుమార్‌, హార్టికల్చర్‌ డీడీ శ్రీని వాస్‌, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి గంగారాం తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-17T06:44:52+05:30 IST