ఉమ్మడి జిల్లాలో లక్ష ఎకరాల్లో డ్రిప్‌ ఇరిగేషన్‌

ABN , First Publish Date - 2020-06-21T10:28:54+05:30 IST

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రైతులు లక్ష ఎకరాల్లో డ్రిప్‌ ఇరిగేషన్‌ పద్ధతిని అవలంబిస్తూ పంటలను సాగు చేస్తున్నారని జిల్లా ఉద్యాన, పట్టు

ఉమ్మడి జిల్లాలో లక్ష ఎకరాల్లో డ్రిప్‌ ఇరిగేషన్‌

 జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమలశాఖ అధికారి బి శ్రీనివాస్‌


తిమ్మాపూర్‌, జూన్‌ 20: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రైతులు లక్ష ఎకరాల్లో డ్రిప్‌ ఇరిగేషన్‌ పద్ధతిని అవలంబిస్తూ పంటలను సాగు చేస్తున్నారని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమలశాఖ అధికారి బి శ్రీనివాస్‌ తెలిపారు. శనివారం తిమ్మాపూర్‌ మండల ప్రజాపరిషత్‌ కార్యలయ సమావేశ మందిరంలో ఎంపీపీ కేతిరెడ్డి వనిత అధ్యక్షతన ఉద్యాన పంటల సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.


ఈ కార్యక్రమానికి జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమలశాఖ అధికారి బి శ్రీనివాస్‌ ముఖ్య అతిథిగా హజరై మాట్లాడారు. పంట మార్పిడి జరగడం వల్ల రైతులకు చాల మేలు జరుగుతుందన్నారు. రైతులు పూలు, పండ్లు, కూరగాయల సాగుపై దృష్టి పెట్టలని సూచించారు. పెరి కల్చర్‌ పై రైతులు దృష్టి సారించాలని, ఆదాయం సమకూర్చే పంటలను పండించాలని కొరారు. కార్యక్రమంలో పట్ట్టు పరిశ్రమ శాఖ సహాయ సంచాలకులు ఆదిరెడ్డి, మానకొండూర్‌ నియోజకవర్గ ఉద్యాన అధికారి కె స్వాతి, మండల వ్యవసాయధికారి సురేందర్‌, ఎంపీడీవో రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-21T10:28:54+05:30 IST