డబుల్‌ బెడ్‌రూం ఇళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలి

ABN , First Publish Date - 2020-11-26T05:16:01+05:30 IST

జిల్లాలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలని కలెక్టర్‌ కె శశాంక అన్నారు.

డబుల్‌ బెడ్‌రూం ఇళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ కె శశాంక

కలెక్టర్‌ కె శశాంక

కరీంనగర్‌, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలని కలెక్టర్‌ కె శశాంక అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌, మున్సిపల్‌ కమిషనర్‌ వల్లూరి క్రాంతి, ఆర్డీవో ఆనంద్‌ కుమార్‌తో కలిసి డబుల్‌ బెడ్‌రూం గృహాల నిర్మాణాల పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 6,474గృహాలు మంజూరయ్యాయని, అందులో 2,787 గృహాల పనులు ప్రారంభమయ్యాయని, మిగిలిన గృహాల కొరకై స్థలసేకరణ చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. మొదలు పెట్టిన 2,787గృహాలకు మౌలిక వసతులు, విద్యుత్‌, సెప్టిక్‌ ట్యాంకుల నిర్మాణం, మిషన్‌ భగీరథ, తాగునీటి సరఫరా, రోడ్లు, డ్రెయినేజీల పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే వీటికి అయ్యే నిధులు సమకూర్చనున్నట్లు ఆయన తెలిపారు. మొదలు పెట్టని గృహాలకు వెంటనే టెండర్లు పలకాలని ఆయన తెలిపారు. ఆర్డీవో ఆనంద్‌ కుమార్‌, ట్రాన్స్‌కో ఎస్‌ఈ మాధవరావు, ఆర్‌అండ్‌బి ఈఈ సాంబశివరాం, పీహెచ్‌ ఈఈ చిన్నారావు, ఆర్‌డబ్ల్యుఎస్‌ ఈఈ ఉప్పలయ్య, తదితరులు పాల్గొన్నారు.

Read more