ఆవులను వధించవద్దు
ABN , First Publish Date - 2020-07-18T10:39:23+05:30 IST
చట్టాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని, ఆవులను వధించవద్దని ఎంఐఎం జగిత్యాల పట్టణ అఽధ్యక్షుడు యునూస్ నదీమ్ అన్నారు.

జగిత్యాల టౌన్, జూలై 17 : చట్టాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని, ఆవులను వధించవద్దని ఎంఐఎం జగిత్యాల పట్టణ అధ్యక్షుడు యునూస్ నదీమ్ అన్నారు. శుక్రవారం జగిత్యాల పట్టణంలోని సుబీ గార్డెన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. పవిత్ర బక్రీద్ పర్వదినం రోజున ఆవులను వధించకూడదని నదీమ్ పిలుపునిచ్చారు. బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు గోవులను వధించవద్దని మస్లీం సెంట్రల్ కమిటీ అధ్యక్షుడు మీర్ ఖాజీమ్ అలీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.