అభివృద్ధి పనుల్లో అలసత్వం వద్దు
ABN , First Publish Date - 2020-12-04T05:03:23+05:30 IST
గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతు న్న అభివృద్ధి పనులపై అధికారులు, ప్రజాప్రతినిధులు అల సత్వం చేయకుండా త్వరితగతిన పూర్తిచేయాలని జిల్లా స్థా నిక సంస్థల అదనపు కలెక్టర్ కుమార్‌దీపక్ ఆదేశించారు.

- త్వరితగతిన పూర్తి చేయాలి
- అదనపు కలెక్టర్ కుమార్ దీపక్
ఎలిగేడు, డిసెంబరు 3: గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతు న్న అభివృద్ధి పనులపై అధికారులు, ప్రజాప్రతినిధులు అల సత్వం చేయకుండా త్వరితగతిన పూర్తిచేయాలని జిల్లా స్థా నిక సంస్థల అదనపు కలెక్టర్ కుమార్‌దీపక్ ఆదేశించారు. మండల పరిషత్ కార్యాలయంలో గురువారం వివిధ శాఖ ల అధికారులు, సర్పంచ్‌లతో కలిసి పల్లెప్రగతి పనుల అభి వృద్ధిపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సం దర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన పనులను వేగవంతం చేసి ఎప్ప టికప్పుడు సమీక్షించుకొని లక్ష్యాల ను అధిగమించాలని సూచించారు. పల్లెప్రగతిని ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా తీసుకొని ఆరా తీస్తోందన్నా రు. అధికారులు, ప్రజాప్రతినిధులు అలసత్వం విడనాడి సమన్వయం తో పనిచేసి ఈనెల 31 వరకు పూ ర్తిచేయాలన్నారు. అసంపూర్తిగా ని లిచిన, మిగిలిపోయినా పనులపై ప్రత్యేక దృష్టి సారించి ప్రగతి నివే దికలను జిల్లాస్థాయి అధికారులకు పంపించాలన్నారు. ఒకవైపు ప్రభు త్వం మరోవైపు జిల్లా స్థాయి అధి కారులు సమీక్షలు జరుపుతూ చైత న్యం తీసుకువస్తున్నప్పటికి ఎందు కు నిర్లక్ష్యం వీడడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. నర్సా పూర్, బుర్హాన్‌మియాపేట, లాలపల్లి, శివపల్లి, ర్యాకల్ దేవ్ పల్లిలో నత్తనడకన సాగుతున్న వైకుంఠదామాల పనులపై అడిగి తెలుసుకున్నారు. రైతు వేదికల నిర్మాణాల ప్రగతిపై ఆరా తీశారు. జడ్పీ సీఈవో, ఇన్‌చార్జి జిల్లా పంచాయతీ అధికారి గీత, జడ్పీ వైస్‌చైర్‌పర్సన్ మండిగ రేణుక, ఎంపీపీ తానిపర్తి స్రవంతి, డీఎల్‌పీవో దేవకీదేవి, ఎంపీడీవో శ్రీనివా సమూర్తి, ఎంపీవో అనిల్‌రెడ్డి, ఎంఈవో కవిత, సర్పంచ్‌లు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.