ఆన్‌లైన్‌ ద్వారానే ఇసుక పంపిణీ

ABN , First Publish Date - 2020-07-15T11:10:44+05:30 IST

నగరవాసులకు భవన నిర్మాణ పనుల కోసం ఆన్‌లైన్‌ ద్వారానే ఇసుక పంపిణీ చేస్తామని కలెక్టర్‌ కె. శశాంక అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌, పోలీస్‌ కమిషనర్‌

ఆన్‌లైన్‌ ద్వారానే ఇసుక పంపిణీ

జిల్లా కలెక్టర్‌ కె శశాంక


కరీంనగర్‌, జూలై 14 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): నగరవాసులకు భవన నిర్మాణ పనుల కోసం ఆన్‌లైన్‌ ద్వారానే ఇసుక పంపిణీ చేస్తామని కలెక్టర్‌ కె. శశాంక అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌, పోలీస్‌ కమిషనర్‌ కమలాసన్‌ రెడ్డి, రెవెన్యూ, పోలీసు, మైనింగ్‌ అధికారులతో జిల్లాస్థాయిలో ఇసుకపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్డాడుతూ మన ఇసుక యాప్‌ ద్వారా ఆన్‌లైన్‌లో ఇసుక పంపిణీ జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే 10ఇసుక రీచ్‌లు ఉన్నాయని, ప్రతి మండలానికి అందుబాటులో మరికొన్ని రీచ్‌లను గుర్తించామని కలెక్టర్‌ తెలిపారు.


ఊటూరు, చల్లూరు, బొమ్మకల్‌, చేగుర్తి, రామంచ, తనుగుల, వెల్ది, లింగాపూర్‌, రేణికుంట, చొక్కారావుపల్లిల్లో ఇసుక రీచ్‌లున్నాయని అన్నారు. ప్రభుత్వ పనులకు ఇసుక సరఫరా చేస్తామని తెలిపారు. 0-10కిలోమీటర్లకు ఒక స్లాగ్‌గా గుర్తించామని తెలిపారు. రీచ్‌ల వద్ద ఇసుక సరఫరా కోసం ట్రాక్టర్లను రిజిస్ర్టేషన్‌ చేయించాలని తహసీల్దార్లను ఆదేశించారు. ట్రాక్టర్ల డ్రైవర్లకు లైసెన్సులు ఉండాలని, ట్రాక్టర్లకు తప్పనిసరిగా ఇన్సూరెన్స్‌ ఉండాలని సూచించారు. ఇసుకను ప్రజలు మీసేవ కేంద్రాల్లో బుక్‌ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ఇసుక పెనాల్టీ కింద 2019-20 సంవత్సరంలో 362 కేసులకు 22,95,700రూపాయలను, 2020-21సంవత్సరానికి 63కేసులకు 3.90 లక్షల రూపాయలను వసూలు చేసినట్లు కలెక్టర్‌ తెలిపారు.


బక్రీదును శాంతియుత వాతావరణంలో జరుపుకుందాం..

బక్రీదు పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకుందామని కలెక్టర్‌ కె శశాంక అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌, పోలీస్‌ కమిషనర్‌ కమలాసన్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ క్రాంతితో కలిసి బక్రీదు ఏర్పాట్లపై జిల్లా అధికారులు, పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ నెల రోజులు ఆవులను, దూడలను ఎవరూ అమ్మరాదని, సంతలలోకి తీసుకురావద్దని సూచించారు.  

Updated Date - 2020-07-15T11:10:44+05:30 IST