పేదలకు నిత్యావసరాల పంపిణీ

ABN , First Publish Date - 2020-05-09T10:14:39+05:30 IST

లాక్‌డౌన్‌లో ఉపాధిలేక ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలకు పలు వురు చేయూతనందిస్తున్నారు.

పేదలకు నిత్యావసరాల పంపిణీ

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల) :లాక్‌డౌన్‌లో ఉపాధిలేక ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలకు పలు వురు చేయూతనందిస్తున్నారు.శుక్రవారం సిరిసిల్లలో తెలంగాణ వారాల సం ఘం ప్రతినిధులు  మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళాచక్రపాణి చేతుల మీ దుగా పేదలకు నిత్యావసరాలు అందజేశారు. కౌన్సిలర్‌ గడ్డం చందన, మాజీ కౌన్సిలర్‌ యెల్లె లక్ష్మీనారాయణ, టీఆర్‌ఎస్‌ నాయకులు గుండ్లపల్లి శ్రీనివాస్‌, గడ్డం భగవాన్‌, బత్తుల రమేష్‌ పాల్గొన్నారు. సిరిసిల్లలోని వివిధ వార్డుల్లో కౌన్సిలర్లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కూరగాయలు పంపిణీ చేశారు. 


వేములవాడలో..

లాక్‌డౌన్‌ నేపథ్యంలో వేములవాడ పట్టణంలోని నిరుపేదలు, వలస కూలీలకు రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో శుక్ర వారం జగిత్యాల బస్టాండ్‌, శివపార్వతుల కాలనీ, శాస్త్రినగర్‌ తదితర ప్రాం తాల్లో అన్నదానం చేశారు. టీఆర్‌కే చారిటబుల్‌ ట్రస్టు వ్యవస్థాపకుడు తోట రామ్‌కుమార్‌ సూచనలతో ట్రస్టు డైరెక్టర్‌ మహేశ్‌కుమార్‌, సభ్యులు స్థానిక ఫొటోగ్రాఫర్లకు నిత్యావసరాలు  అందజేశారు. సహాయం కో సం ఎదురుచూసేవారికి టీఆర్‌కే ట్రస్టు ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని తోట రామ్‌కుమార్‌ తెలిపారు. 

Updated Date - 2020-05-09T10:14:39+05:30 IST