నిరుపేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ
ABN , First Publish Date - 2020-05-24T10:57:01+05:30 IST
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో శనివారం జ మా మసీద్ వద్ద ముస్లింలకు రంజాన్ నిత్యావసర సరుకులను ప్ర భుత్వం తరపున పెద్దపల్లి ఎమ్మెల్యే

పెద్దపల్లి కల్చరల్, మే 23: పెద్దపల్లి జిల్లా కేంద్రంలో శనివారం జ మా మసీద్ వద్ద ముస్లింలకు రంజాన్ నిత్యావసర సరుకులను ప్ర భుత్వం తరపున పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అందజేశా రు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దాసరి మమతారెడ్డ్డి, కౌన్సిలర్ లు, ఏసీపీ హబీబ్‌ఖాన్, సీఐ, ఎస్ఐ తదితరులు పాల్గొన్నారు. రామగుండం 27వ డివిజన్ కార్పొరేటర్ శిరీషసంజీవ్ శనివారం పారిశుధ్య కార్మికులకు మజ్జిగ పంపిణీ చేశారు.
లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయిన పేద ముస్లింలకు రంజాన్ పండుగను పురస్కరించుకుని సినీ హీరోల అభిమాన సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో గుండేటి రాజేస్, కాపెల్లి సతీష్, రవీందర్రావు, ప్రవీణ్, రాజేందర్లు సేమియా, స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. గోదావరిఖని గంగానగర్, విఠల్‌నగర్, ఫైవింక్లయిన్, తిలక్నగర్లలోని మసీదుల్లో శనివారం విజయమ్మ ఫౌండేషన్, రాధాస్ ఆయుర్వేద్ ఆధ్వర్యంలో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పేద ముస్లింలకు బియ్యం, సరుకులు అందజేశారు.
37వ డివిజన్లోని ముస్లీం కుటుంబాలకు స్మైల్‌ప్లీజ్ లాఫింగ్ క్లబ్, విజయమ్మ ఫౌండేషన్, రాధాస్ ఆయుర్వేద ద్వారా నిత్యావసరాలు పంపిణీ చేశారు. రామగుండం పట్టణంలో 21వ డివిజన్ కార్పొరేటర్ ముబారక్‌నగర్‌లో శనివారం రామగుండం ఎమ్మెల్యే కోరురకం టి చందర్ ముస్లిం కుటుంబాలకు విజయమ్మ ఫౌండేషన్ ద్వారా రం జాన్ నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.మేయర్ అనీల్‌కుమా ర్, డిప్యూటీ మేయర్ అభిషేక్‌రావు, మడిపెల్లి మల్లేష్ పాల్గొన్నారు.