నిరుపేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ

ABN , First Publish Date - 2020-05-10T10:39:07+05:30 IST

గోదావరిఖని మార్కండేయ కాలనీలోని ఒక ఫంక్షన్‌హాలో విజయమ్మ ఫౌండేషన్‌ ద్వా రా నిరుపేదలకు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి

నిరుపేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ

కళ్యాణ్‌నగర్‌, మే 9: గోదావరిఖని మార్కండేయ కాలనీలోని ఒక ఫంక్షన్‌హాలో విజయమ్మ ఫౌండేషన్‌ ద్వా రా నిరుపేదలకు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చం దర్‌, మేయర్‌ డాక్టర్‌ అనీల్‌కుమార్‌, కార్పొరేటర్‌ సతీ ష్‌కుమార్‌ తదితరులు బియ్యం, నిత్యావసర సరుకులు అందజేశారు. పరుశరాంనగర్‌లోని మార్గదర్శి పాఠశాల పూర్వ విద్యార్థులు పేదలకు అన్నదానం నిర్వహించారు. ఎలిగేడు మండలంలోని నారాయణపల్లిలో శనివారం ప్రతి ఆసుపత్రి ఆఽధ్వర్యంలో పీఏసీఎస్‌ ఐకేపీ కొనుగోలు కేంద్రంలో హమాలీ, వ్యవసాయ రైతులకు మాస్క్‌లను పంపిణీ చేశారు.


రామగుండంలో పారిశుధ్య కార్మికులకు, ఆటోడ్రైవర్లకు కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చా ర్జి ఎంఎస్‌ రాజ్‌ఠాకూర్‌ శనివారం నిత్యావసర సరుకు లు, కూరగాయలు అందజేశారు. కాల్వశ్రీరాంపూర్‌ మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో 24 గ్రామపంచాయతీల పారిశుధ్య కార్మికులను జిల్లా అధ్యక్షుడు అంబాల రాజేందర్‌ శనివా రం ఘనంగా సన్మానించారు. సర్పంచ్‌ శ్రీదేవిరాజు, మా జీ జడ్పీటీసీ రవిందర్‌గౌడ్‌ తదితరులు ఉన్నారు.  

Updated Date - 2020-05-10T10:39:07+05:30 IST