కేంద్ర నిబంధనలతోనే రైతులకు ఇబ్బందులు

ABN , First Publish Date - 2020-11-07T10:31:41+05:30 IST

కేంద్ర ప్రభుత్వ నిబంధనలతోనే రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు

కేంద్ర నిబంధనలతోనే రైతులకు ఇబ్బందులు

రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌


కరీంనగర్‌ రూరల్‌, నవంబర్‌ 6: కేంద్ర ప్రభుత్వ నిబంధనలతోనే రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. శుక్రవారం కరీంనగర్‌ రూరల్‌ మండలం దుర్శేడ్‌ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఆందోళన చెందవద్దని రంగు మారిన ధాన్యం ఎఫ్‌సిఐ అనుమతితో కొనుగోలు చేస్తామన్నారు. సన్న రకాలను రైతులు దళారులకు అమ్మి మోసపోవద్దన్నారు. రాజకీయం కోసమే పంటలకు కొన్ని చోట్ల నిప్పంటించారన్నారు. రైతుల సంక్షేమమే ముఖ్యమంత్రి కేసీఆర్‌ లక్ష్యమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 6,490 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.


ఇప్పటి వరకు 2,660 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామన్నారు. రైతుబంధు, కాళేశ్వరం జలాలు, 24 గంటల విద్యుత్‌ అందుతుందని దీంతో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. గిట్టుబాటు ధర 1888 రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌, ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, జడ్పీటీసీ పురమల్ల లలిత, పీఏసీఎస్‌ చైౖర్మన్‌ ఆనందరావు, సర్పంచ్‌ గాజుల వెంకటమ్మ, ఉపసర్పంచ్‌ సుంకిశాల సంపత్‌రావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-07T10:31:41+05:30 IST