-
-
Home » Telangana » Karimnagar » Dharna in front of Ramagundam MLA camp office
-
రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట ధర్నా
ABN , First Publish Date - 2020-12-31T04:48:24+05:30 IST
రామగుండం శాసనసభ్యుడు కోరుకంటి చందర్ క్యాంపు కార్యాలయం ఎదుట బుధవారం రామగుండం మండలం మల్కాపూర్ గ్రా మానికి చెందిన బాధితులు ధర్నాకు దిగారు.

- ఎమ్మెల్యే అనుచరుల భూకబ్జా దందాపై బాధితుల నిరసన
గోదావరిఖని, డిసెంబరు 30: రామగుండం శాసనసభ్యుడు కోరుకంటి చందర్ క్యాంపు కార్యాలయం ఎదుట బుధవారం రామగుండం మండలం మల్కాపూర్ గ్రా మానికి చెందిన బాధితులు ధర్నాకు దిగారు. ఎమ్మెల్యే అ నుచరులమని చెబుతూ మ ల్కాపూర్ శివారు 42సర్వే నెం బర్‌లో భూకబ్జాలకు పాల్పడుతూ అడ్డు వస్తే చంపుతామని బెదిరిస్తున్నారని,వారినుంచి రక్షణ కల్పిం చాలని కోరారు. మల్కాపూర్ గ్రామానికి చెంది న 120మంది మధ్య తరగతి కుటుంబాలు డ బ్బులు పోగు చేసుకుని కొనుక్కున్న ప్లాట్లను ఎమ్మెల్యే అనుచరులమంటూ గుండు రాజు, పెంచాల తిరుపతి, గడ్డం శ్రీను, చెలుకలపెల్లి శ్రీనివాస్, పోరండ్ల ఆనందం కబ్జాలు చేస్తున్నారని వాపోయారు. ఈ విషయంలో ఎమ్మెల్యే చొరవ తీసుకుని తమ సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. కాగా, ఎమ్మెల్యే స్థానికంగా లేకపోవడంతో ఆఫీస్ సిబ్బందికి వినతిపత్రం అందజేశారు. ఈ ఆందోళనలో మిట్ట శంకర్, ముద్దసాని విజయ, బండారి శ్రీనివాస్, రాములు, శ్రీనివాస్, చారి, గోపి దామోదర్, రవీంద్రబాబు, అభి గౌడ్ పాల్గొన్నారు.