ధర్మారం కూరగాయల సంతలో కానరాని భౌతిక దూరం

ABN , First Publish Date - 2020-04-08T10:18:06+05:30 IST

కరోనా వైరస్‌ మహమ్మారి తన ప్రతాపాన్ని చూపిస్తున్నా.. మండల కేంద్రంలోని ప్రజలు భౌతిక దూరం పాటించ

ధర్మారం కూరగాయల సంతలో కానరాని భౌతిక దూరం

ధర్మారం, ఏప్రిల్‌ 7: కరోనా వైరస్‌ మహమ్మారి తన ప్రతాపాన్ని చూపిస్తున్నా.. మండల కేంద్రంలోని ప్రజలు భౌతిక దూరం పాటించ డం లేదు. ప్రతి మంగళవారం కూరగాయల వారసంత జరుగుతుంది. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అధికారులు, పం చాయతీ పాలకవర్గం సూచనల మేరకు ఆర్టీసీ బస్టాండ్‌లోనే కూర గాయల సంతను కొనసాగిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక వ్యక్తికి మరో వ్యక్తికి మధ్య మీటరు చొప్పున భౌతిక దూరం పాటించా లని పదేపదే ప్రకటిస్తున్నా ధర్మారం కూరగాయల సంతలో మాత్రం అమలు కావడం లేదు.


పక్కపక్కనే  ఉంటూ గుంపులుగుంపులుగా తిరుగుతూ ప్రజలు కూరగాయలు కొనుగోలు చేస్తున్నారు. ఇదే సమ యంలో సైరన్‌ మోగిస్తూ పోలీస్‌ వాహనం సంతలో తిరిగినా, పోలీ సులు భౌతిక దూరం పాటించాలని సూచనలు చేస్తున్నా అవేవీ పట్టించుకోకుండా అదే పద్ధతిలోనే కూరగాయలు కొనుగోలు చేశారు. అదేమాదిరిగానే కేడీసీసీ బ్యాంకు వద్ద కూడా పింఛన్‌దారులు భౌతిక దూరంను పాటించలేదు. క్యూలైన్‌లో ఉన్న భౌతిక దూరం నిబంధన లు తుంగలో తొక్కుతున్నారు. ఎక్కడనైనా భౌతిక దూరం పాటించి కరోనా వైరస్‌ను తరమికొట్టడానికి తమవంతు సహకారం అందించా ల్సిన అవసరం ఎంతైన ఉంది. 

Updated Date - 2020-04-08T10:18:06+05:30 IST