ధర్మపురిలో ధనుర్మాసోత్సవాలు ప్రారంభం
ABN , First Publish Date - 2020-12-17T05:43:14+05:30 IST
ధర్మపురి క్షేత్రంలో ధనుర్మాసోత్సవాలు బుధవా రం ఘనంగా ప్రారంభం అయ్యాయి.

ధర్మపురి, డిసెంబరు 16: ధర్మపురి క్షేత్రంలో ధనుర్మాసోత్సవాలు బుధవా రం ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఉత్సవాల సందర్భంగా శ్రీ లక్ష్మీ నర సింహస్వామి, అనుబంధ ఆలయాల్లో ఆలయ వేదపండితులు బొజ్జ ర మేష్‌శర్మ, ఆలయ ఉప ప్రధాన అర్చకులు నేరెళ్ల శ్రీనివాసాచార్యులు, నంబి శ్రీనివాసాచారి, రమణాచారి, నరసింహమూర్తి స్వామి వారలకు అభిషేకా ది కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వా రలకు నివేదన జరిపి, భక్తులకు తీర్థ, ప్రసాద వితరణ జరిపారు. అంతకు ముందు గోదావరి నదిలో స్నానాలు ఆచరించిన భక్తులు ఆలయాలకు చే రుకుని స్వామి వారలను దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో సంకటాల శ్రీనివాస్, యజ్ఞాచార్యులు కందాలై పురుషోత్తమాచార్యు లు, ఆలయ సూపరింటెండెంట్ ద్యావళ్ల, కిరణ్, సీనియర్ అసిస్టెంట్ అలువాల శ్రీనివాస్ పాల్గొన్నారు.