-
-
Home » Telangana » Karimnagar » Devotees flocked to Jatara
-
దేవునిపల్లి జాతరకు పోటెత్తిన భక్త జనం
ABN , First Publish Date - 2020-12-07T05:18:07+05:30 IST
మండలంలో ని దేవునిపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీ లక్ష్మీ నృసింహస్వామి జాతరకు ఆదివారం భక్తజనం పోటెత్తారు.

పెద్దపల్లి రూరల్, డిసెంబరు 6: మండలంలో ని దేవునిపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీ లక్ష్మీ నృసింహస్వామి జాతరకు ఆదివారం భక్తజనం పోటెత్తారు. స్వామివారిని దర్శించుకునేందుకు ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డితో పాటు పలు వురు అధికారులు దర్శించుకొని మొక్కులు తీ ర్చుకున్నారు. జాతరకు వచ్చిన భక్తులకు ఇబ్బం దులు తలెత్తకుండా ఏర్పాట్లను ఆలయ ఈవో శంకర్ పరిశీలించారు. ఆదివారం సెలవుదినం కావడంతో భక్తులు అధికసంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. బసంత్‌నగర్ ఎస్‌ఐ జానీపా షా ఆధ్వర్యంలో భారీబందోబస్తు నిర్వహించారు.