జిల్లాకు తాకిన ఢిల్లీ సెగ

ABN , First Publish Date - 2020-12-08T05:19:03+05:30 IST

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని పదకొండు రోజులుగా ఢిల్లీలో రైతులు చేస్తున్న ధర్నా సెగ జిల్లాకు తాకింది.

జిల్లాకు తాకిన ఢిల్లీ సెగ
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో భారత్‌బంద్‌కు మద్దతుగా బైక్‌ ర్యాలీ నిర్వహిస్తున్న సీపీఐ, సీపీఎం నాయకులు

 నేటి భారత్‌ బంద్‌కు టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ సంపూర్ణ మద్దతు

 వారం రోజులుగా వామపక్షాలు, కార్మిక సంఘాల ఆందోళనలు

 సీపీఎం ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీలు 

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని పదకొండు రోజులుగా ఢిల్లీలో రైతులు చేస్తున్న ధర్నా సెగ జిల్లాకు తాకింది. మంగళవారం నిర్వహించే బంద్‌కు అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ, కాంగ్రెస్‌, వామపక్ష పార్టీలు, కార్మిక సంఘాలు, తదితర సంఘాలు సంపూర్ణ మద్దతును ప్రకటించాయి. ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులతో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన చర్చలు విఫలం కావడంతో భారత్‌ బంద్‌కు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా జిల్లాలో వామపక్ష పార్టీలతో పాటు పలు కార్మిక సంఘాలు, రైతు సంఘాలు నాలుగు రోజు లుగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. నూతన వ్యవసాయ చట్టాలను మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్న టీఆర్‌ఎస్‌ రైతు సంఘాలు ఇచ్చిన బంద్‌ పిలుపునకు మద్దతు పలకడం గమనార్హం. టీఆర్‌ఎస్సే గాకుండా కాంగ్రెస్‌ పార్టీ నేతలు కూడా బంద్‌లో పాల్గొనాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి పిలుపునివ్వడంతో ఆ పార్టీ జిల్లా నేతలు రైతులను సన్నద్ధం చేస్తున్నారు. నూతన చట్టాలను రద్దు చేయాల్సిందేనని హర్యానా, ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌కు చెందిన రైతులు పెద్ద ఎత్తున ఢిల్లీలో ఆందోళన చేస్తున్నారు. రోడ్లపైనే వంటా వార్పు నిర్వహిస్తూ పదకొండు రోజులుగా ధర్నా నిర్వహిస్తున్నారు. పలు దఫాలుగా కేంద్ర మంత్రులు, రైతు సంఘాల ప్రతినిధులతో నిర్వహించిన చర్చలు ఫలించలేదుకేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని పదకొండు రోజులుగా ఢిల్లీలో రైతులు చేస్తున్న ధర్నా సెగ జిల్లాకు తాకింది.  మంగళవారం నిర్వహించే బంద్‌కు అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ, కాంగ్రెస్‌, వామపక్ష పార్టీలు, కార్మిక సంఘాలు, తదితర సంఘాలు సంపూర్ణ మద్దతును ప్రకటించాయి. ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులతో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన చర్చలు విఫలం కావడంతో భారత్‌ బంద్‌కు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా జిల్లాలో వామపక్ష పార్టీలతో పాటు పలు కార్మిక సంఘాలు, రైతు సంఘాలు  నాలుగు రోజు లుగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. నూతన వ్యవసాయ చట్టాలను మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్న టీఆర్‌ఎస్‌ రైతు సంఘాలు ఇచ్చిన బంద్‌ పిలుపునకు మద్దతు పలకడం గమనార్హం. టీఆర్‌ఎస్సే గాకుండా కాంగ్రెస్‌ పార్టీ నేతలు కూడా బంద్‌లో పాల్గొనాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి పిలుపునివ్వడంతో ఆ పార్టీ జిల్లా నేతలు రైతులను సన్నద్ధం చేస్తున్నారు. నూతన చట్టాలను రద్దు చేయాల్సిందేనని హర్యానా, ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌కు చెందిన రైతులు పెద్ద ఎత్తున ఢిల్లీలో ఆందోళన చేస్తున్నారు. రోడ్లపైనే వంటా వార్పు నిర్వహిస్తూ పదకొండు రోజులుగా ధర్నా నిర్వహిస్తున్నారు. పలు దఫాలుగా కేంద్ర మంత్రులు, రైతు సంఘాల ప్రతినిధులతో నిర్వహించిన చర్చలు ఫలించలేదు. దీంతో 8న రైతు సంఘాలు భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చాయి. కేవలం ఉత్తరాది రాష్ట్రాలకే పరిమితమైన వ్యవసాయ బిల్లు రద్దు అంశం దక్షిణాది రాష్ట్రాలకు పాకుతున్నది. 

 జిల్లాలోనూ నిరసనలు..


ఇప్పటికే జిల్లాలో వామపక్ష పార్టీల నాయకులు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. సోమవారం పెద్దపల్లి, గోదావరిఖనిలో బంద్‌ను విజయవంతం చేయాలని సీపీఎం, సీఐటీయూ ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. 8న జరగనున్న బంద్‌ మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్నది. రోడ్డుపై ఆర్టీసీ బస్సులు ఎక్కడం లేదు. పలు బ్యాంకుల, తదితర ఉద్యోగ సంఘాలు కూడా బంద్‌కు సంపూర్ణ మద్దతును ప్రకటించాయి. జిల్లాలో ఎక్కడికక్కడే బంద్‌ నిర్వహించాలని జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌, రామగుండం, పెద్దపల్లి ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్‌, దాసరి మనోహర్‌ రెడ్డి, టీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు పార్టీ క్యాడర్‌కు ఆదేశించారు. అలాగే బంద్‌కు వ్యాపార, వాణిజ్య వర్గాలు సహకరించాలని, పెద్ద ఎత్తున రైతులు ఈ బంద్‌లో పాల్గొని తమ ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు. 

  బంద్‌ను విజయవంతం చేయండి..


రైతులను నష్టపరిచే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీలో రైతులు నిర్వహిస్తున్న ధర్నాకు సంఘీభావంగా రైతు సంఘాలు ఇచ్చిన భారత్‌ బంద్‌ను విజయవంతం చేయాలని మంథని ఎమ్మెల్యే, టీపీసీసీ ఉపాధ్యక్షుడు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, డీసీసీ అధ్యక్షుడు ఈర్ల కొమురయ్య పిలుపు నిచ్చారు. ఈ మేరకు వారు ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా భారత్‌ బంద్‌లో కాంగ్రెస్‌ నాయకులు, శ్రేణులు కార్మికులు, కర్షకులు, అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలని, ఈ బంద్‌కు వ్యాపార, వాణిజ్యవేత్తలు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరారు. 

Updated Date - 2020-12-08T05:19:03+05:30 IST