ప్రశ్నిస్తే అక్రమ కేసులా?

ABN , First Publish Date - 2020-09-12T11:11:41+05:30 IST

అర్హులైన మధ్యమానేరు నిర్వాసితులకు ప్యాకేజీలు ఎందుకు ఇవ్వరని ప్రశ్నిస్తే తమపై కేసులు పెడు తున్నారని టీపీసీసీ అధికార ..

ప్రశ్నిస్తే అక్రమ కేసులా?

సిరిసిల్ల టౌన్‌, సెప్టెంబరు 11:అర్హులైన మధ్యమానేరు నిర్వాసితులకు ప్యాకేజీలు ఎందుకు ఇవ్వరని ప్రశ్నిస్తే తమపై కేసులు పెడు తున్నారని టీపీసీసీ అధికార ప్రతినిధి దాసరి భూమయ్య అన్నారు. శుక్రవారం సిరి సిల్ల పట్టణం జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మధ్యమానేరు నిర్వాసితులకు ప్యాకేజీలు రాకపోవడంతో కాంగ్రెస్‌ నాయ కులు గళం విప్పారన్నారు. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌ బీపీ ఎల్‌ కింద ప్యాకేజీని పొందారని, ఆ ప్రాంతానికి చెందిన మహిళలకు  ప్యాకేజీలు రాలేదని అన్నారు.


సంతోష్‌ సోదరికి మాత్రం ప్యాకేజీ వచ్చిం దన్నారు. కొదురుపాకలో నివాసం, స్థలం లేని సంతోష్‌ చిన్నానకు ఒక పట్టా ప్యాకేజీ ఇచ్చారని ఆరోపించారు. దీనిపై పలు వేదకలపై ప్రశ్నిం చడంతో తనతోపాటు కాంగ్రెస్‌ నాయకులపై అక్రమ కేసులు పెట్టార న్నారు.   దీనిపై మధ్యమానేరు ప్రాజెక్టు వద్ద ప్రజా కోర్టు వద్ద రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్‌ సిద్ధమా? అని సవాలు విసిరారు. ఇసుక అక్రమ రవాణా వెనకాల ఎవరున్నారో అధికారులు గుర్తించి చట్టాలకు లోబడి కేసులు పెట్టాలని డిమాండ్‌ చేశారు. జిల్లా కాంగ్రెస్‌ కార్యదర్శి కూస రవీందర్‌, పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు సూర దేవారాజు తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2020-09-12T11:11:41+05:30 IST