కేసీఆర్‌ కపట ప్రేమను దళితులు గ్రహించాలి: బీజేపీ

ABN , First Publish Date - 2020-12-29T04:54:43+05:30 IST

: సీఎం కేసీఆర్‌ దళిత వ్యతిరేక విధానాలను దళితులందరూ గమనించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, దళితమోర్చా జిల్లా అధ్యక్షుడు సోమిడి వేణుప్రసాద్‌ కోరారు.

కేసీఆర్‌ కపట ప్రేమను దళితులు గ్రహించాలి: బీజేపీ
కరీంనగర్‌ మండల తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న బీజేపీ నాయకులు

సుభాష్‌నగర్‌, డిసెంబరు 28: సీఎం కేసీఆర్‌ దళిత వ్యతిరేక విధానాలను దళితులందరూ గమనించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, దళితమోర్చా జిల్లా అధ్యక్షుడు సోమిడి వేణుప్రసాద్‌ కోరారు. సోమవారం దళితమోర్చా ఆధ్వర్యంలో మండల రెవెన్యూ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా దళితుడినే చేస్తానని ప్రక టించి అమలు చేయక దళితులందరినీ మోసం చేశాడని విమర్శించారు. దళితులకు మూడెకరాల భూమిని వెంటనే పంపిణీ చేయాలని, ఎస్సీకార్పొరేషన్‌ ద్వారా ఉపకారవేతనాలు ఇవ్వాలని తదితర డిమాండ్లు చేశారు. అనంతరం ఎమ్మార్వో సుధాకర్‌కు వినతిపత్రం సమర్పించారు.

Updated Date - 2020-12-29T04:54:43+05:30 IST