తెగిన మిడ్‌మానేరు కుడి కాలువ

ABN , First Publish Date - 2020-08-16T10:56:37+05:30 IST

కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడి మండలంలో శుక్రవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి సీతారాంపూర్‌, బొమ్మనపల్లి, పీచుపల్లి, రేకొండ

తెగిన మిడ్‌మానేరు కుడి కాలువ

చిగురుమామిడి, ఆగస్టు 15: కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడి మండలంలో శుక్రవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి సీతారాంపూర్‌, బొమ్మనపల్లి, పీచుపల్లి, రేకొండ గ్రామాల్లో ఇటీవల నిర్మించిన మిడ్‌మానేరు కుడికాలవకు గండ్లు పడ్డాయి. పలుచోట్ల కాలువ తెగి పోవడంతో ఆయా గ్రామాల్లోని పంట పొలాలు పూర్తిగా నీటిలో మునిగాయి. ఇరిగేషన్‌ శాఖ ఈఈ రమేష్‌, డీఈ కృష్ణ, ఎంపీపీ కొత్తవినీత-శ్రీనివాస్‌రెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు రవిందర్‌ గండ్లను పరిశీలించారు. 

Updated Date - 2020-08-16T10:56:37+05:30 IST