-
-
Home » Telangana » Karimnagar » Crowd at Rajanna temple
-
రాజన్న క్షేత్రంలో భక్తుల రద్దీ
ABN , First Publish Date - 2020-11-27T05:30:00+05:30 IST
దక్షిణ కాశీ వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం శుక్రవారం భక్తులతో రద్దీగా మారింది.

వేములవాడ, నవంబరు 27: దక్షిణ కాశీ వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం శుక్రవారం భక్తులతో రద్దీగా మారింది. కార్తీకమాసం సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు సర్వదర్శనం క్యూలైన్ మీదుగా ఆలయంలోకి చేరుకున్నారు. తమ ఇష్టదైవమైన రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకొని తరించారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కు చెల్లించుకున్నారు. ఆలయ ఆవరణలో కార్తీకదీపాలు వెలిగించారు. సుమారు 15 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు, 10 లక్షల రూపాయల మేరకు ఆదాయం లభించినట్లు అధికారులు తెలిపారు.