పంట మార్పిడి విధానాలను అవలంబించాలి

ABN , First Publish Date - 2020-05-13T06:18:11+05:30 IST

పంటమార్పిడి విధానాలు అవలంబిస్తూ మరిన్ని లాభాలను గడించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరా శాఖల మంత్రి గంగుల కమలాకర్‌

పంట మార్పిడి విధానాలను అవలంబించాలి

రాష్ట్ర బీసీసంక్షేమ, పౌర సరఫర శాఖల మంత్రి గంగుల


కరీంనగర్‌ టౌన్‌, మే 12: పంటమార్పిడి విధానాలు అవలంబిస్తూ మరిన్ని లాభాలను గడించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరా శాఖల మంత్రి గంగుల కమలాకర్‌ రైతులకు పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టరేట్‌లో వానాకాలం పంటలు, సమగ్ర వ్యవసాయ విధాన ప్రణాళికపై రైతు సమన్వయ సభ్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ రైతుల కోసం సమగ్ర వ్యవసాయ విధానం రూపొందించాలన్నారు.


పంట మార్పిడి విధానాలకు ప్రోత్సహించాలని అధికారులు, రైతు సమన్వయ సమితి సభ్యులకు సూచించారు.  మన పంటలు మనమే పండించుకోవాలని ముఖ్యమంత్రి సూచిస్తే కొంత మంది రైతుబంధు రద్దు చేస్తున్నారంటు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.  వ్యవసాయభూముల్లో భూసార పరీక్షలు చేసి వాటి ఆధారంగా ఎరువులు, రసాయనాలు వాడాలని సూచించారు. విత్తనాల నుంచి గిట్టు ధర వరకు రైతులకు ఏ ఇబ్బంది లేకుండా చేయడమే ప్రభుత్వ ఉద్దేశ్యమన్నారు. దొడ్డు రకం వడ్ల స్థానంలో సన్న రకాలు పండించాలన్నారు. ఏప్రిల్‌ మే నెలల్లో వరికోతల సమయంలోనే వడగళ్ల వానలు పడుతున్నాయన్నారు.


ఈ సమస్యలు రాకుండా పంట కాలం ముందకు తెచ్చుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్‌, సుంకె రవిశంకర్‌, సతీష్‌కుమార్‌, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, కలెక్టర్‌ శశాంక, జడ్పీ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ, మేయర్‌ వై సునీల్‌రావు, అదనపు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌ పాల్గొన్నారు.

Read more