-
-
Home » Telangana » Karimnagar » crime
-
మురికి కాల్వలో కారు బోల్తా
ABN , First Publish Date - 2020-12-19T05:42:32+05:30 IST
కోరుట్ల పట్టణంలోని జాతీయ రహదారిపై ముగురు కాలువలో కారు బోల్తా కొట్టిన ఘటనలో ముగ్గురు గాయాల పాలయ్యారు.

తప్పిన ప్రాణాపాయం
ప్రమాదంలో ముగ్గురికి గాయాలు
కోరుట్ల్ల, డిసెంబరు 17 : కోరుట్ల పట్టణంలోని జాతీయ రహదారిపై ముగురు కాలువలో కారు బోల్తా కొట్టిన ఘటనలో ముగ్గురు గాయాల పాలయ్యారు. జాతీయ రహదారిపై జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనుల లో భాగంగా కల్వటు నిర్మాణం కోసం రోడ్డుకు అడ్డంగా తీసిన గోతిలో కారు పడి ముగ్గురు గాయాల పాలయ్యారు. మెట్‌పల్లి పట్టణం నుం చివేగంగా కోరుట్లకు వస్తున్న కారు అదుపుతప్పి గోతిలో పడిపోయిం ది. హైదరాబాద్ పట్టణానికి చెందిన బట్టల వ్యాపారులు ఆదిలాబాద్ జి ల్లా దెహగాం వెళ్లి కోరుట్లకు వస్తున్నారు. ఈ సమయంలో పట్టణంలోని గాంధీ చౌరస్తా వద్ద ప్రమా దానికి గురైంది. కారులో ప్రయాణిస్తున్న శై లేంధర్ బండారి, రాంచవ్, డ్రైవర్ ఫహీంలు తీవ్ర గాయాలపాల య్యా రు. గమనించిన స్థానికులు క్షతగాత్రులను బయటకు తీసి చికిత్స నిమి త్తం ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని కోరుట్ల ఎస్‌ఐ రాజ ప్రమీల పరిశీలన జరిపారు. జాతీయ రహదారిపై జరుగుతున్న పను లకు నిర్వాహకులు హెచ్చరిక సూచిక బోర్డులను ఏర్పాటు చేయకపోవ డంతో ప్రమాదం చోటు చేసు కుందని పలువురు ఆరోపిస్తున్నారు.
కోరుట్ల రూరల్ : మండలంలోని ఎఖీన్‌పూర్ గ్రామ శివారులో కోరు ట్ల-వేములవాడ రహదారిలో కారు బోల్తా కొట్టి నలుగురి గాయాలు అ యినట్లు గ్రామస్థులు తెలిపారు. నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి మం డలం కోనాపూర్ గ్రామానికి చెందిన నలుగురు కారులో కోరుట్ల నుంచి కోనాపూర్ వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడిన వారిని జగిత్యాల అసుపత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలిసింది.