మృత్యువుతో పోరాడి ఓడిన మోక్షజ్ఞ

ABN , First Publish Date - 2020-12-11T05:03:47+05:30 IST

అప్పుల బాధతో తల్లిదం డ్రులు తీసుకున్న నిర్ణయానికి వారితో పాటు 11 ఏళ్ల కొడుకు బలయ్యాడు.

మృత్యువుతో పోరాడి ఓడిన మోక్షజ్ఞ
తల్లిదండ్రులు అందె సమ్మయ్య, కృష్ణవేణితో మోక్షజ్ఞ(ఫైల్‌)

 నాలుగు రోజుల క్రితం తల్లిదండ్రుల మృతి

 అప్పుల బాధతో కుటుంబం బలి

 కరీంనగర్‌ క్రైం, డిసెంబరు 10 : అప్పుల బాధతో తల్లిదం డ్రులు తీసుకున్న నిర్ణయానికి వారితో పాటు 11 ఏళ్ల కొడుకు బలయ్యాడు. నిండు నూరేళ్లు జీవించాల్సిన బాలుడు తల్లి దండ్రుల కారణంగా వారి వెనకనే పరలోకానికి పయన మయ్యాడు. తల్లిదండ్రులే కన్నకొడుకుకు వారి చేతితోనే పురుగుమందు తాగించి ప్రాణాలు తీశారు. అప్పుల బాధ ను తట్టుకోలేక తల్లిదండ్రులు బలవంతంగా పురుగుల మందుతాగి, వారి ఒక్కగానొక్క కొడుకుకు బలవంతంగా తా గించగా ఈ నెల 7న తల్లిదం డ్రులు మరణించగా అప్పటి నుంచి మృత్యువుతో పోరాడు తున్న కొడుకు అందె మోక్షజ్ఞ (11) గురువారం వరంగల్‌ ఎంజీఎంలో మృతి చెందాడు. 

సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్‌ గాంధీరోడ్‌కు చెందిన అందె సమ్మయ్య(40), ఆయన భార్య కృష్ణవేణి(32) ఈ నెల 6న అర్ధరాత్రి సమయంలో కరీంనగర్‌లోని జ్యోతినగర్‌లో అద్దె ఇంటిలోనే గడ్డిమందుతాగి, బలవంతంగా వారి కొడుకు మోక్షజ్ఞకు తాగించి, అతని చెవిలో పోశారు. సమ్మయ్య, కృష్ణవేణిలు 7వ తేదీన కరీంనగర్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించగా వారి కొడుకు మోక్షజ్ఞను కరీంనగర్‌ ఆస్పత్రి నుం చి ఈ నెల 9న వరంగల్‌లోని ఎంజీఎంకు తరలించి చికిత్స చేయిస్తున్నారు. అక్కడ చికిత్సపొందుతూ గురువారం సాయంత్రం 4 గంటలకు మరణించా డు. అప్పుల బాధకు ఒక కుటుంబం మొత్తం ముగ్గురు మరణించటం అటు హుస్నాబాద్‌లోని బంధువులు, ఇటు కరీంనగర్‌లోని స్నేహితులు, స్థానికుల ను కలచివేసింది. చలాకీగా ఉంటుండే మోక్షజ్ఞ మరణించాడనే విషయాన్ని స్థానికులు జీర్ణించుకోలేక పోతున్నారు. తోటి పిల్లలు కూడా అతన్ని గుర్తు చేసుకుంటూ కంటతడిపెడుతున్నారు. కరీంనగర్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో చికి త్స పొందుతున్న సమయంలో కూడా తనకు పురుగుల మందు తాగించా రని, చెవిలో పోశారని పోలీసులతో మోక్షజ్ఞ తెలిపినట్లు సమాచారం. కొడుకు, కోడలు, మనువడు మృతి చెందడంతో హుస్నాబాద్‌లో ఉండే వృద్ధుడు వెంకటయ్య ఒంటరివాడయ్యాడు. కొద్ది రోజుల కిందటే సమ్మయ్య తండ్రి వద్దకు వచ్చి ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పి వెళ్లాడు. ఆ తరువాత తనకు జాగ్రత్త చెప్పిన కొడుకే ప్రాణాలు తీసుకోవటంతో 80 ఏళ్ల వయస్సులో వెంకటయ్య రోదన ఆపటం ఎవరితరం కావటం లేదు. 


Updated Date - 2020-12-11T05:03:47+05:30 IST