అశోక్‌నగర్‌లో చెయిన్‌స్నాచింగ్‌

ABN , First Publish Date - 2020-12-02T05:15:55+05:30 IST

కరీంనగర్‌లోని అశోక్‌న గర్‌కు చెందిన అవుదుర్తి సత్తమ్మ అనే వృద్ధురాలి మెడలోని బంగారు పుస్తెలతాడును గుర్తుతెలియని వ్యక్తులు తెంపుకుని పారిపోయారు.

అశోక్‌నగర్‌లో చెయిన్‌స్నాచింగ్‌

కరీంనగర్‌ క్రైం, డిసెంబరు 1 : కరీంనగర్‌లోని అశోక్‌న గర్‌కు చెందిన అవుదుర్తి సత్తమ్మ అనే వృద్ధురాలి మెడలోని బంగారు పుస్తెలతాడును గుర్తుతెలియని వ్యక్తులు తెంపుకుని పారిపోయారు. మంగళవారం సత్తమ్మ శనివా రం మార్కెట్‌కు వెళ్లి వస్తుండగా ఆమె వెనుకనే పల్సర్‌ బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు 7 తులాల బంగారు గొలుసును తెంపుకుని పారిపోయారని బాధితురాలు ఒకటో ఠాణా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. బైక్‌పై వచ్చిన వ్యక్తుల్లో ఒక హెల్మెట్‌ ధరించగా, మరొకరు మంకీ క్యాప్‌ దరించి ఉన్నట్లు బాధితురాలు తెలిపారు. సమా చారం అందుకున్న సిటీ ఏసీపీ అశోక్‌, సీఐ విజయ్‌కు మార్‌లు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరి పారు. సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలిస్తున్నారు. 

Updated Date - 2020-12-02T05:15:55+05:30 IST