జిల్లాలో మరో 25 మందికి కరోనా పాజిటివ్‌

ABN , First Publish Date - 2020-12-02T05:10:10+05:30 IST

జిల్లాలో మంగళవారం కొత్తగా 25 మందికి కోవిడ్‌ వ్యాధి బారినపడ్డారు.

జిల్లాలో మరో 25 మందికి కరోనా పాజిటివ్‌

కరీంనగర్‌, డిసెంబర్‌ 1 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో మంగళవారం కొత్తగా 25 మందికి కోవిడ్‌ వ్యాధి బారినపడ్డారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంగళవారం ప్రకటించిన బులిటెన్‌లో పేర్కొన్నారు. జిల్లాలో మంగళవారం సాయం త్రం వరకు 66 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు  స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు తెలిసింది. ఇందులో కరీంనగర్‌ పట్టణంలో 41 మంది కరోనా వ్యాధిబారిన పడగా 25 మంది గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారున్నారు.  కరీంనగర్‌ పట్టణంలోని సప్తగిరికాలనీ పరిసర ప్రాంతాలకు చెందిన తొమ్మిదిమందికి, హౌసింగ్‌బోర్డులో ఒకరికి, అశోక్‌నగర్‌లో ఇద్దరికి,  కట్టరాంపూర్‌కు చెందిన ఒకరికి, భగత్‌నగర్‌కు చెందిన నలుగురికి, కోతిరాంపూర్‌లో ఇద్దరి కి, రాంనగర్‌లో ముగ్గురికి, గణేశ్‌నగర్‌కు చెందిన ఒకరికి, వావిలాలపల్లిలో ఒకరికి,   మౌతాజ్‌ఖాన్‌ ప్రాంతంలో ఒకరికి,, విద్యానగర్‌లో ఇద్దరికి కరోనా పాజిటివ్‌ వచ్చింది.  గంగాధర మండలంలో ఇద్దరు, రామడుగు మండలంలో ఒకరు, శంకరపట్నం మండలంలో ఒకరు, చొప్పదండి మండలంలోని భూమపాలపల్లిలో ఏర్పాటు చేసిన కోవిడ్‌ పరీక్షా శిబిరంలో 12 మంది, కొత్తపట్టి ము న్సిపాలిటీలో ఇద్దరు, చిగురుమామిడి మం డలంలో ఒకరు, హుజురాబాద్‌లో ఐదుగురు, జమ్మికుంటలో ఒకరు, కొత్తపల్లి మండలంలో ఒకరు, శంకరపట్నం మండలంలో ఒకరు కోవిడ్‌ వ్యాధిబారిన పడ్డారు. చాలా మంది ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో సిటీస్కాన్‌, ఆర్‌టీపీసీ పరీక్షలను చేయించుకొని పాజిటివ్‌ వస్తే ఇంటి వద్దనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నట్లు తెలిసింది. 

Updated Date - 2020-12-02T05:10:10+05:30 IST