నేరస్తులకు శిక్ష పడేలా విధులు నిర్వహించాలి

ABN , First Publish Date - 2020-11-22T05:15:53+05:30 IST

నేరస్తులకు శిక్ష పడేలా కోర్టు డ్యూటీ అధికారులు విధులు నిర్వహించాలని జిల్లా అదనపు ఎస్పీ సురేష్‌కుమార్‌ అన్నారు.

నేరస్తులకు శిక్ష పడేలా విధులు నిర్వహించాలి
సమావేశంలో మాట్లాడుతున్న అదనపు ఎస్పీ

జిల్లా అదనపు ఎస్పీ సురేష్‌ కుమార్‌

జగిత్యాల టౌన్‌, నవంబరు 21 : నేరస్తులకు శిక్ష పడేలా కోర్టు డ్యూటీ అధికారులు విధులు నిర్వహించాలని జిల్లా అదనపు ఎస్పీ సురేష్‌కుమార్‌ అన్నారు. శనివారం జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో జిల్లాలోని కోర్టు విధులు నిర్వహిస్తున్న కోర్టు డ్యూటీ అధికారులతో కోర్టులో నిర్వహించాల్సి న విధులు, భాధ్యతలపై జిల్లా అదనపు ఎస్పీ సురేష్‌కుమార్‌ సమీక్ష స మావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోర్టు కా నిస్టేబుల్‌ భాధ్యత చాలా కీలకమైనదని, ఎఫ్‌ఐఆర్‌ నమోదు నుంచికేసు పూర్తయ్యేంత వరకు నిందితుల నేరాలను నిరూపించేంలా పని చేయాల్సిన భాధ్యత ఉంటుందన్నారు. కోర్టు కేసుల సమాచారం ఎప్పటికప్పుడు సం బంధిత స్టేషన్‌హౌజ్‌ అధికార్లకు తెలియజేయాలన్నారు. కేసు ట్రయల్‌ స మయాల్లో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ సలహాలు, సూచనలు స్వీకరించాలన్నారు. కోర్టు విధులలో చక్కని ప్రతిభ కనబరిచిన వారికి ప్రతినెల రివార్డులు అం దజేస్తామన్నారు. ఈ సమావేశంలో డీసీఆర్‌బీ ఇన్స్‌ఫెక్టర్‌ రాఘవేంధ్రరావు, ఐటీ కోర్‌ ఇన్స్‌ఫెక్టర్‌ సరిలాల్‌, సీఎంఎస్‌ ఎస్సై రాజు నాయక్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-11-22T05:15:53+05:30 IST