నేరాల నియంత్రణ, ఛేదనలో సీసీ కెమెరాలు కీలకం

ABN , First Publish Date - 2020-11-22T04:56:24+05:30 IST

నేరాల నియంత్రణ, కేసులు ఛేదనలో సీసీ కెమెరాలు కీలక పాత్రపోషిస్తాయని పోలీస్‌కమిషనర్‌ వీబీ కమలా సన్‌రెడ్డి అన్నారు.

నేరాల నియంత్రణ, ఛేదనలో సీసీ కెమెరాలు కీలకం
సీసీ కెమెరాలను ప్రారంభిస్తున్న సీపీ కమలాసన్‌ రెడ్డి


పోలీస్‌ కమిషనర్‌ వీబీ కమలాసన్‌రెడ్డి

కరీంనగర్‌ క్రైం, నవంబరు 21: నేరాల నియంత్రణ, కేసులు ఛేదనలో సీసీ కెమెరాలు కీలక పాత్రపోషిస్తాయని పోలీస్‌కమిషనర్‌ వీబీ కమలా సన్‌రెడ్డి అన్నారు. నేను సైతం కార్యక్రమంలో భాగంగా కరీంనగర్‌ రాజీవ్‌ ఆటోనగర్‌లో ఆటోగ్యారేజీ, షోరూంల నిర్వాహకులు 70మంది అసోసియే షన్‌గా ఏర్పడి విరాళాలతో 130సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్నారు. ఈ కెమెరాలను పోలీస్‌కమిషనర్‌ వీబీ కమలాసన్‌రెడ్డి శనివారం ప్రారం భించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ఒక సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని పేర్కొన్నారు. పోలీసులు విధినిర్వహ ణలో 24గంటలు రెప్ప వాల్చకుండా ఉండలేరని, కానీ సీసీకెమెరా 24 గంటలు పనిచేస్తుం దన్నారు. ఆటోనగర్‌లో కోట్ల రూపాయల విలువైన వాహనాలు, వాహనాల విడిభాగాలు, ఇతర వస్తువులుంటాయని, వీటికి రక్షణగా ఇక నుంచి వీటన్నిటిపై సీసీ కెమెరాల నిఘా ఉంటుందన్నారు. సీసీ కెమెరాల పుటేజీల ఆధారంగా ఇటీవలనే ఆటోనగర్‌లో ఒక హత్య కేసును చేధించామని, కమిషనరేట్‌లో చాలా కేసులు, నిందితుల అరె స్టుల్లో సీసీ కెమెరాలు కీలకంగా పనిచేయని ఉదహరించారు. వ్యాపారు లకు సీసీకెమెరాలపై అవగాహన కల్పించి, ఇంత పెద్ద ఎత్తున సీసీ కెమెరాలు ఏర్పాటుచేసుకునేలా కృషి చేసిన ఒకటోఠాణా సీఐ విజయ్‌కు మార్‌, అధికారులు, సిబ్బందిని సీపీ అభినందిం చారు. రాజీవ్‌ ఆటోనగర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో పోలీస్‌కమిషనర్‌ను శాలువాతో సన్మానిం చారు. కార్యక్రమంలో అడిషనల్‌ డీసీపీలు ఎస్‌ శ్రీనివాస్‌, జీ చంద్రమో హన్‌, ఏసీపీ పీ అశోక్‌, సీఐ జీ విజయ్‌కుమార్‌, ఎస్‌ఐ సందవేన శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Read more