అధికారులు కలిసికట్టుగా పనిచేయాలి

ABN , First Publish Date - 2020-03-21T11:37:12+05:30 IST

జగిత్యాల జిల్లాలో కరోనా వైరస్‌పై కలెక్టరెట్‌ కార్యాలయంలో కలెక్టర్‌ జి.రవి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

అధికారులు కలిసికట్టుగా పనిచేయాలి

జిల్లా కలెక్టర్‌ రవి

అధికారులు, ప్రజాప్రతినిదులతో విడియో కాన్ఫరెన్స్‌


జగిత్యాల,ఆంధ్రజ్యోతి మార్చి 20 : జగిత్యాల జిల్లాలో కరోనా వైరస్‌పై కలెక్టరెట్‌ కార్యాలయంలో కలెక్టర్‌ జి.రవి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీ ఆర్‌ ఆదేశాల మేరకు జిల్లాలో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. జిల్లాకు చెందినవారు ఇతరదేశాల నుండి జిల్లాకు వచ్చినవారు గత నెల 25వ తేదీ నుంచి ఈ నెల 18 వరకు 1443 మంది హైదరాబాద్‌ నుండి వచ్చారని, అన్ని మండలల అధికారులు అందరూ గ్రామ గ్రామాలలో తిరుగి వారి వివరాలను సేకరించాలన్నారు. ఇప్పటివరకు 1,611 మందిని వారి వివరాలను సేకరించినందుకు అధికారులను అభినందించారు. ఇదే స్పూర్తితో అందరూ ఒకటీం వర్క్‌గా పనిచేయాలని సూచించారు.


ప్రస్తుతం 968 మంది వారి గృహాల్లో ప్రత్యేక గదుల్లో ఉన్నట్లుగా తెలిపారు. వారిని బయటికి వెళ్లకుండా కుటుంబ సభ్యులకు కలవకుండా కుటుంబ సభ్యులకు కలవకుండా ఉండేవిధంగా అధికారులు.ప్రజా ప్రతినిధులు చూడాలని అన్నారు. ఈ నెల 31వరకు ఫంక్షన్‌ హల్‌,సినిమా ధియేటర్ల్‌, పార్కులు,జిమ్‌లు,  అన్ని మూసివేయాలని అన్నా రు. అదేవిధంగా ఇప్పటివరకు ఫంక్షన్‌ హాల్‌ బుక్‌ చేసుకుని వివహాలు చేసుకునేవారు 200మందికి కంటే ఎక్కువ మించరాదని, ఎక్కువ మంది ఉన్నట్లయితే చట్టరీత్యా ప్రభుత్వ ఉత్వర్వుల ప్రకారం చర్యలు తీసుకుంటామాని అన్నారు.  దేవాలయల్లో పూజలు మాత్రం చేస్తారని, ప్రజలు అందరూ స్వచ్ఛందంగా ఇంట్లోనే పూజలు చేసుకోవాలని కోరారు. ఉగాది,శ్రీరామనవమి లాంటివి మన ఇంట్లోనే పూజా కార్యక్రమాలు చేసుకోవాలన్నారు. ఇతర దేశాల నుంచి వచ్చిన వారు ఎట్టి పరిస్ధితుల్లోనూ బయటికి వెళ్ళ కుండదని అన్నారు. అత్యవసర పరిస్ధితుల్లో మాత్రమే బయటకి వెళ్లాలన్నారు. జిల్లాలో 968 మంది గృహాలలో ప్రత్యేక గదులలో ఉన్నవారు బయటికి వస్తే వారిపై కేసులు పెట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ సింధూశర్మ, అదనపు కలెక్టర్‌ రాజేశం,డీఆర్‌వో అరుణశ్రీ  పాల్గొన్నారు.

Updated Date - 2020-03-21T11:37:12+05:30 IST