జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ABN , First Publish Date - 2020-03-16T11:49:44+05:30 IST
జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
జగిత్యాల, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): ప్రపంచ దేశాలను కల వరపెడుతున్న కరోనా వైరస్‌పై జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండా లని జిల్లా కలెక్టర్ రవి అన్నారు. ఆదివారం కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జిల్లాలోని విద్యా సంస్థలు, కోచింగ్ కేంద్రా లు, ఫంక్షన్ హాల్‌లు ఈ నెల 31 వరకు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. బోర్డు పరీక్షలు యదావిధిగా కొనసాగిస్తామని పేర్కొ న్నారు. వివాహాలు చేసుకునేందుకు ఇప్పటికే బుకింగ్ చేసుకున్నవారు వారి బంధువులను తక్కువ సంఖ్యలో హాజ రయ్యే విధంగా చూడాలన్నారు. ఇకముందు వివాహాలకు ఎలాంటి ఫంక్షన్ హాల్‌లను బుకింగ్‌లకు ఈ నెల 31 వరకు ఇవ్వవద్దని ఆదేశా లు జారీ చేశారు. సినిమా హాల్‌లు, పార్క్‌లు, స్విమ్మింగ్ ఫూల్‌లు, జి మ్నాస్టిక్‌లు, జూపార్క్‌లు, మ్యూజియంలు, క్లబ్‌లు, బార్‌లు 31 వరకు మూసివేయాలని అన్నారు. జిల్లాలో ఎలాంటి సభలు, సమావేశాలు, వర్క్‌షాప్‌లు, సమ్మర్ క్యాంప్‌లు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల పోటీలు,ఉత్సవాలు,ఎగ్జిబిషన్‌లు,ర్యాలీలు నిర్వహించకూ డదని అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆస్పత్రిలో కరోనా వైరస్ ప్రభావం ఉన్న వ్యక్తులకు ప్రత్యేకంగా ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రత్యేకంగా బెడ్‌లను ఏర్పాటు చేసి, నిరంతర వైద్య సిబ్బం దిని నియమించడం జరిగిందని వివరించారు.