మరో 119 మందికి కరోనా

ABN , First Publish Date - 2020-09-14T10:37:19+05:30 IST

జిల్లాలో మరో 119 మంది కోవిడ్‌ మహమ్మారి బారిన పడ్డారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఆదివారం విడుదల

మరో 119 మందికి కరోనా

తిమ్మాపూర్‌ పీహెచ్‌సీలో పని చేసే ఓ ఉద్యోగికి పాజిటివ్‌

నిలిచిన పరీక్షలు 


కరీంనగర్‌, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): జిల్లాలో మరో 119 మంది కోవిడ్‌ మహమ్మారి బారిన పడ్డారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఆదివారం విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కొన్నారు. తిమ్మాపూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ఒక ఉద్యోగికి కరోనా సోకడంతో ఆదివారం అక్కడ కొవిడ్‌ పరీక్షలను నిలిపివేశారు.  స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు జిల్లా వ్యాప్తంగా ఆదివారం దాదాపు 300 వరకు కేసులు నమోదైనట్లు తెలిసింది. చొప్పదండి మండలంలో 7, చిగురుమామిడిలో 2, రామడుగులో 2, కరీంనగర్‌ రూరల్‌లో 6, కొత్తపల్లిలో 9, గంగాధరలో 3, మానకొండూర్‌లో 21,  హుజురాబాద్‌లో 23, జమ్మికుంటలో 14, సైదాపూర్‌లో ఆరుగురికి, వీణవంక ఒకరికి, ఇల్లందకుంట మండలంలో ఐదుగురికి, శంకరపట్నం మండలంలో ఐదుగురికి కొవిడ్‌ సోకింది.  


పట్టణంలోని గణేశ్‌నగర్‌లో ఒకరు, తిరుమల్‌నగర్‌లో ఒకరు, కట్టరాంపూర్‌లో ఇద్దరు, సిక్కువాడిలో ఒకరు, భగత్‌నగర్‌లో ఏడుగురు కరోనా బారిన పడ్డారు. విద్యానగర్‌లో ఆరుగురు, చైతన్యపురిలో ఒకరు, జ్యోతినగర్‌లో 12 మందికి పాజిటివ్‌ వచ్చింది. క్రిస్టియన్‌ కాలనీలో నలుగురికి, ఆదర్శనగర్‌లో ఇద్దరికి, కిసాన్‌నగర్‌లో ఇద్దరికి, వావిలాలపల్లిలో ఇద్దరికి, సుభాష్‌నగర్‌లో ఒకరికి, బ్యాంకుకాలనీలో ఒకరికి, మంకమ్మతోటలో ఐదుగురికి, కాపువాడలో ఇద్దరికి, కట్టరాంపూర్‌లో ఇద్దరికి, బోయవాడలో ముగ్గురికి, మారుతీనగర్‌లో ముగ్గురికి, లక్ష్మీనగర్‌లో ఐదుగురికి, మౌతాజ్‌ఖాన్‌లో ఒకరికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. చాలా మంది ప్రైవేట్‌ ఆసుపత్రులు, ల్యాబ్‌లలో సీటీస్కాన్‌ చేసుకొని కోవిడ్‌ లక్షణాలుంటే అందుకు సంబంధించిన మందులను ఇంట్లోనే ఉండి తీసుకుంటున్నారు. కొంత మంది వరంగల్‌ ఎంజీఎం, హైదరాబాద్‌కు చికిత్స కోసం వెళ్తున్నవారు జిల్లా అధికారులకు సమాచారమివ్వక పోవడంతో వారి సంఖ్యను లెక్కలోకి తీసుకోవడం లేదు. రెండు, మూడు రోజులుగా 300 వరకు కేసులు పరిమితం అవుతుండడంతో కొంత తగ్గుముఖం పడుతుందనే భావన వ్యక్తమవుతున్నది. 

Updated Date - 2020-09-14T10:37:19+05:30 IST