కార్మికులపై కరోనా పంజా
ABN , First Publish Date - 2020-07-18T10:34:01+05:30 IST
కొవిడ్-19 సింగరేణి గ ని కార్మికులను కబళిస్తున్నది. రెండు మాసాలుగా అనారోగ్యంతో మరణిస్తున్న కార్మికులు కొవిడ్ బారి న పడినవారిని

చికిత్సకు వెళ్లేలోపే మింగేస్తున్న మహమ్మారి
‘ఫేస్’వర్కర్లకు పొంచి ఉన్న ముప్పు
సింగరేణి కోల్‌బెల్ట్‌లో ఆందోళన
గోదావరిఖని, జూలై 17: కొవిడ్-19 సింగరేణి గ ని కార్మికులను కబళిస్తున్నది. రెండు మాసాలుగా అనారోగ్యంతో మరణిస్తున్న కార్మికులు కొవిడ్ బారి న పడినవారిని పరిశీలిస్తే ఈ విషయం నిర్ధారణ అవుతున్నది. ఇతర ఉద్యోగాలు చేసేవారు, ఇతర ప్రాంతాలవారు కరోనా బారినపడి బతికి బట్టకడుతున్నా, సింగరేణి కార్మికులు మాత్రం కరోనా సోకితే కాలం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సింగరే ణి బొగ్గు, దుమ్ము, ధూళి కారణంగా సహజంగానే ఇతరులతో పోల్చితే 60 శాతం ఊపిరితిత్తులు చెడిపోయి సింగరేణి కార్మికులు ఇబ్బందిపడతారు. రి టైర్ అయిన కొద్దిరోజులకే సహజ మరణాలు పొందుతున్న కార్మికుల్లో కూడా 90శాతం ఊపిరితిత్తుల వ్యాధులతో చనిపోతున్నారు. ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపే కరోనా సోకిన సింగరేణి కార్మికులు రికవరీ కావడం కష్టంగా మారింది. పదిహే ను రోజులుగా ఈ రకమైన మరణాల సంఖ్య కోల్‌బెల్ట్‌లో పెరిగింది.
ఫేస్‌వర్కర్లే ఎక్కువ..
రామగుండం రీజియన్‌లో మరణించిన కార్మికు లు ఊపిరితిత్తుల సమస్యలు, కొవిడ్-19 బారిన పడి మృతిచెందుతున్నారు. మృతుల్లో ఎక్కువగా ఫేస్ వర్కర్లే ఉంటున్నారు. రెండు రోజుల క్రితం చనిపోయిన ఒక కార్మికుడు కూడా ఫేస్‌వర్కర్ కా వడం ఈ అంశాన్ని నిర్ధారిస్తున్నది. ఊపిరితిత్తుల ఇబ్బందులు ఉన్న కార్మికులు చికిత్స చేయించుకునేందుకు వెళ్లే 24 గంటల్లోనే మృత్యువాత పడుతున్నారు. కరోనా పరీక్షలు జరగకముందే ఆ లక్షణాలతో చనిపోతున్నారు.
మొన్న ఒక హెడ్ ఓవర్‌మెన్ చనిపోగా, గురు వారం వన్‌సీఎస్‌పీలో కన్వేయర్ ఆపరేటర్‌గా పనిచేసే 57 ఏళ్ల కార్మికుడు కూడా మృతిచెందాడు. శ్వాస సంబంధమైన ఇబ్బందితో సింగరేణి ఆసుపత్రికి వెళ్లిన ఆపరేటర్ పరీక్షలు జరుపుతున్న గంటలోపే కుప్పకూలి మరణించాడు. అతన్ని ఎక్స్‌రే రిపోర్టులో ఊపిరితిత్తులు పూర్తిగా పాడైనట్టుగా తేలింది. 15 రోజుల క్రితం సీ తానగర్‌కు చెందిన ఓ రిటైర్డ్ కార్మికుడు కూడా ఈ సమస్యతో సతమతమవుతూ కరోనా బారినపడి మృతిచెందాడు.
విష వాయువులతో ప్రమాదం..
బొగ్గు ఉత్పత్తి స్థలాల్లో, తరలింపు స్థలాల్లో కార్బన్ అత్యధికంగా ఉంటుంది. కార్బన్ మోనాక్సైడ్, మీథేన్‌లాంటి విష వాయువులు అత్యధికంగా ఉంటాయి. ఇవి కార్మికుడి ఊపిరితిత్తులను దెబ్బతీస్తాయి. ప్రధానంగా ఓపెన్‌కాస్టు బ్లాస్టింగ్ ప్రాంతాలు,బొగ్గుతీసే యంత్రాల ఆపరేటర్లు,కన్వేయర్‌బెల్ట్ వద్ద పనిచేసే కార్మి కులతో పాటు సీహెచ్‌పీ, సీఎస్‌పీ ప్రాంతాల్లో పనిచేసే 90శాతం కార్మికులకు ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. అలాగే ఓవర్‌మెన్‌లు, సర్దార్లు, కోల్‌కట్టర్లు,షార్ట్‌ఫైరర్ వంటి పనులుచేసే హ్యాం డ్ సెక్షన్ వర్కర్లంతా ఊపిరితిత్తుల వ్యాధులకు గురవుతున్న విషయం శాస్త్రీయంగా తేలింది.