హైదరాబాద్ నుంచి వచ్చిన మహిళ.. జగిత్యాలలో కరోనా టెస్ట్ చేయించుకోగా..

ABN , First Publish Date - 2020-07-20T19:53:17+05:30 IST

జగిత్యాల జిల్లాలో ఆదివారం కలకలం రేగింది. ఇప్పటి వరకు రోజుకు ఒకటి, రెండు కేసులు మాత్రమే వస్తుండటంతో ప్రజలు కొంత ఊపిరి పీల్చుకున్నారు. ఆదివారం 11 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. నాలుగైదు రోజులుగా

హైదరాబాద్ నుంచి వచ్చిన మహిళ.. జగిత్యాలలో కరోనా టెస్ట్ చేయించుకోగా..

కరోనా కలకలం.. ఒకే రోజు 11 పాజిటివ్‌ కేసులు

అప్రమత్తమైన అధికారులు

ఇద్దరు ఆశా వర్కర్లకు సోకిన వైరస్‌


జగిత్యాల(ఆంధ్రజ్యోతి): జగిత్యాల జిల్లాలో ఆదివారం కలకలం రేగింది. ఇప్పటి వరకు రోజుకు ఒకటి, రెండు కేసులు మాత్రమే వస్తుండటంతో ప్రజలు కొంత ఊపిరి పీల్చుకున్నారు. ఆదివారం 11 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. నాలుగైదు రోజులుగా రెండు, మూడు కేసులు బయట పడుతుండగా, శుక్ర, శనివారాలు ఒక్క కేసు కూడా లేదు. దీంతో జిల్లాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని అందరూ భావిస్తుండగా కొత్తగా 11 కేసులు కావడంతో అధికారులు కాంటాక్ట్‌ వివరాలను సేకరిస్తున్నారు. జగిత్యాల పట్టణంలోని సుభాష్‌నగర్‌కు చెందిన ఓ మహిళతో పాటు జగిత్యాల మండలంలోని తాటిపెల్లికి చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. అలాగే మల్యాల మండలం తక్కళ్లపెల్లికి చెందిన మరో వ్యక్తికి, జగిత్యాలలోని ఓ మహిళకు, అరవింద్‌నగర్‌లోని భార్యభర్తలకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. 


అలాగే మంచిర్యాల జిల్లాలోని దండేపల్లికి చెందిన మహిళకు జగిత్యాలలో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌ వచ్చింది. హైదరాబాద్‌లోని ఎల్‌బీనగర్‌లో ఉంటున్న గోదావరిఖనికి చెందిన మహిళ జగిత్యాలలో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌ వచ్చింది. పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ప్రాంతానికి చెందిన ఓ మహిళ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌ అని తేలింది. కొడిమ్యాల మండల కేంద్రంలో పనిచేస్తున్న ఆశ వర్కర్‌తో పాటు పూడూర్‌లో పనిచేస్తున్న ఆశ వర్కర్‌కు పాజిటివ్‌ రావడంతో వైద్య సిబ్బందిలో ఆందోళన నెలకొంది. ఇలా జగిత్యాల జిల్లాలో ఒకే రోజు 11 పాజిటివ్‌ కేసులు రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 


జిల్లాలో 152కు చేరిన కేసులు

జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 152కు చేరుకుంది. ఇందులో 96 మంది ఇప్పటికే డిశ్చార్జ్‌ అయ్యారు. 11 పాజిటివ్‌ కేసులతో కలిపి 53 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే జిల్లాలో ముగ్గురు మరణించారు. ప్రభుత్వం కరోనా పాజిటివ్‌ వచ్చినవారిని హోం క్వారంటైన్‌లో ఉండాలని ఆదేశించడంతో ఎక్కడి వారు అక్కడే హోం క్వారంటైన్‌లో ఉంటున్నప్పటికీ కొన్ని చోట్ల సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే పలు చోట్ల కొందరు బయటకు వస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది.

Updated Date - 2020-07-20T19:53:17+05:30 IST