ప్రభుత్వ లక్ష్యాల సాధనకు సహకరించాలి

ABN , First Publish Date - 2020-12-02T05:23:09+05:30 IST

ప్రభుత్వ లక్ష్యాల సాధనకు బ్యాంకర్లు సహకరించి రుణాలు అందించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ కుమార్‌దీపక్‌ అన్నారు.

ప్రభుత్వ లక్ష్యాల సాధనకు సహకరించాలి
సమావేశంలో మాట్లాడుతున్న స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ కుమార్‌దీపక్‌

- స్థానికసంస్థల అదనపు కలెక్టర్‌కుమార్‌ దీపక్‌

- అధికారులు, బ్యాంకర్లతో సమీక్ష సమావేశం

పెద్దపల్లి, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ లక్ష్యాల సాధనకు బ్యాంకర్లు సహకరించి రుణాలు అందించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ కుమార్‌దీపక్‌ అన్నారు. ఆత్మనిర్భర్‌ భారత్‌ ప్యాకేజి కింద ప్రధా నమంత్రి వీధివ్యాపారుల ఆత్మనిర్భర్‌ సీఎం సావ్‌ నిధి, సంబంధిత అం శాలపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ మంగళవారం సంబంధిత అధి కారులు, బ్యాంకర్లతో కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సమీక్ష నిర్వ హించారు. జిల్లాలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 8,752 స్వశక్తి సంఘాలకు రూ.234,41 కోట్ల రుణం మంజూరు లక్ష్యంగా కాగా, ఇప్పటివరకు 5,926 స్వశక్తి సంఘాలకు రూ.171.83 కోట్ల రుణాలు మంజూరు చేశామని మె ప్మా కింద 432 మహిళ సంఘాలకు రూ.21.75 కోట్లు లక్ష్యం కాగా ఇప్ప టివరకు 352 స్వశక్తి సంఘాలకు 14.58 కోట్ల రుణం మంజూరు చేశామ ని తెలిపారు. గ్రామీణప్రాంతాలలో ప్రజలకు అవగాహన కల్పించే దిశగా ఏప్రిల్‌ నుంచి ఇప్పటివరకు 122 క్యాంపు నిర్వహించామని బ్యాంకర్లు తెలిపారు. జిల్లాలో మొత్తం 117240 ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజన ఖాతాలు అందించామని తెలిపారు. ఆత్మనిర్భర్‌ భారత్‌ ప్యాకేజి కింద చిన్న, మధ్య తరణ పరిశ్రమలకు రుణాలు అందించాలని అదనపు కలె క్టర్‌ సూచించారు. సెప్టెంబరు 30 వరకు ప్రదానమంత్రి ఉపాధి కల్పన పథకం కింద 119 దరఖాస్తులను పరిశీలించి రూ.4.26 కోట్ల రుణం అం దించామని, ప్రధానమంత్రి ఫసల్‌ భీమా యోజన కింద పెండింగ్‌ వాటి ని పరిశీలించి గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహించామని తెలిపారు. యువతకు స్వయం ఉపాధి పెంపొందించడానికి ప్రభుత్వం ముద్రా స్కీం ద్వారా రుణాలు అందిస్తుందని అదికారులు వివరించారు. కోవిడ్‌ 19 వైరస్‌తో కుదేలైనా ఆర్థిక వ్యవస్థ చిరువ్యాపారులకు అవసరమై న సహకారం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.20 లక్షల కోట్ల భారి ప్యాకేజి ప్రకటించిందని, ప్యాకేజి వినియోగించుకోవడం పట్ల ప్రజలలో అవగాహన కల్పించి అత్యధికంగా వినియోగించుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. చిరువ్యాపారులకు వెంటనే చేతిలో కొంతమేర నగదు అందుబాటులోకి తెచ్చేందుకు రూ.10వేల రుణం అందించాల్సిందిగా ప్రభుత్వం సూ చించిందని, దీనిని జిల్లాలో ఉన్న చిరువ్యాపారులకు, వీధి వ్యాపారులకు వర్తింపజేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ అధికారులను సూచించారు. జిల్లాలో 4 మున్సిపాలిటిల పరిధిలో ఇప్పటివరకు బ్యాంకులకు 15,760వీధివ్యాపారుల నుంచి దరఖాస్తులు వచ్చాయని వీరికి బ్యాంకర్లు ఇప్పటివరకు 12180 మందికి రుణం మంజూరుచేసి 6291 మందికి అందించారని తెలిపారు. రుణం మంజూరుచేసిన మిగిలిన వారికి సైతం త్వరగా రుణసోమ్ము అందజేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ఆదేశించారు. జిల్లాలో గుర్తించిన వీధివ్యాపారు లందరికి వెండింగ్‌ సర్టిఫికేట్‌ అందించి బ్యాంకుల ద్వా రా రూ.10 వేల రుణం పొందేలా చర్యలు తీసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ఆదేశించారు. ప్రస్తుత విపత్కర పరిస్థితులలో ప్రభుత్వం అందించే సహాయం పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటూ మళ్లీ ఆర్థిక వ్యవస్థ వృద్ధి అ య్యేలా కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా లీడ్‌ బ్యాంకు మేనే జర్‌ ప్రేమ్‌కుమార్‌, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి వినోధ్‌కుమార్‌, ఈడీ ఎస్సీఎస్టీ సరిత, యూబీఐ మేనేజర్‌ ప్రవీణ్‌, ఏడీ వ్యవసాయ శాఖ ముర ళి, సంబంధిత అధికారులు, బ్యాంకింగ్‌ప్రతినిధులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-02T05:23:09+05:30 IST